అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడల్స్ : ఒప్పో రెనో సిరీస్ వచ్చేస్తోంది

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రెనో సిరీస్ వచ్చేస్తోంది. మే 28న ఇండియాలో ఒప్పో రెనో సిరీస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : May 11, 2019 / 12:29 PM IST
అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడల్స్ : ఒప్పో రెనో సిరీస్ వచ్చేస్తోంది

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రెనో సిరీస్ వచ్చేస్తోంది. మే 28న ఇండియాలో ఒప్పో రెనో సిరీస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రెనో సిరీస్ వచ్చేస్తోంది. మే 28న ఇండియాలో ఒప్పో రెనో సిరీస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఒప్పో నుంచి రెనో, ఒప్పో రెనో 10 జూమ్ ఎడిషన్, ఒప్పో రెనో 5G మోడల్స్ రిలీజ్ కాగా.. ఏప్రిల్ నెలలో చైనాలో ఈ మోడల్ సిరీస్ ను లాంచ్ చేసింది.

ఇందులో మూడు ఫోన్లలో సైడ్ స్వింగ్ సెల్ఫీ కెమెరా మాడ్యుల్ హైలెట్స్ గా నిలువనున్నాయి. అయితే ఇండియాలో విడుదల అయ్యే రెనో సిరీస్ ఫోన్ల ధర ఇండియాలో ఎంత ఉంటుంది అనేదానిపై ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదు. 

ఒప్పో రెనో 5జీ మోడల్ ఫోన్లు ఇండియాలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశంలో 5జీ టెలికం నెట్ వర్క్ లేకపోవడంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మే 28న ఒప్పో రెనో, రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ కానున్నాయి.

ఈ రెండు సిరీస్ ఫోన్లలో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ లో మూడు కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. స్టాండర్డ్ రెనో లో 48 మెగా ఫిక్సల్, 5 మెగాఫిక్సల్ కెమెరాలు ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ : 
* క్వాల్ కామ్న్ టాప్ నాచ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్ సెట్
* 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ షూటర్, 13MP సెన్సార్
* 16 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా షూటర్  
* 6.55 అంగుళాల Amoled డిసిప్లే, ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్
* గొర్లిల్లా గ్లాస్ 6, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ 
* 4,065mAh బ్యాటరీ, vooc 3.0 పాస్ట్ ఛార్జింగ్ టెక్
* 6GB RAM, 128GB స్టోరేజీ

ఒప్పో రెనో వెర్షన్ : 
* స్నాప్ డ్రాగన్ 710 ఎస్ఓసీ 
* షార్క్ ఫిన్ షేప్ డ్ పాప్ అప్ సెల్ఫీ మాడ్యుల్
* 48MP రియర్ కెమెరా, 5MP కెమెరా 
* సూపర్ క్లియర్ నైట్ మోడ్
* 16 మెగా ఫిక్సల్ స్నాపర్
* 6GB ర్యామ్, 256GB
* 8GB ర్యామ్ 256 GB