Electricity Bill on Paytm : పేటీఎం ద్వారా కరెంట్ బిల్లు కడుతున్నారా? ఇలా చేస్తే.. 100శాతం క్యాష్‌బ్యాక్, మరెన్నో రివార్డులు పొందవచ్చు..!

Paytm Bijelee Days : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ (Paytm) నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించే యూజర్లందరికి పేటీఎం బిజ్లీ డేస్ (Paytm Bijlee Days) ప్రకటించింది.

Electricity Bill on Paytm : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ (Paytm) నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించే యూజర్లందరికి పేటీఎం బిజ్లీ డేస్ (Paytm Bijlee Days) ప్రకటించింది. ప్రతి నెలా 10-15 తేదీల మధ్య విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేసే వినియోగదారులకు 100 శాతం క్యాష్ బ్యాక్‌తో పాటు అదనపు రివార్డులను డిజిటల్ చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్ అందిస్తోంది. One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) యాజమాన్యంలోని Paytm కంపెనీ తమ Bijlee Daysలో భాగంగా విద్యుత్ బిల్లు చెల్లింపులపై ప్రతి రోజు కనీసం 50 మంది యూజర్లకు100 శాతం క్యాష్‌బ్యాక్‌తో రూ. 2,000 వరకు అందిస్తోంది.

అదనంగా, టాప్ షాపింగ్, ట్రావెల్ బ్రాండ్‌ల నుంచి యూజర్లకు డిస్కౌంట్ వోచర్‌లు కూడా అందిస్తోంది. Paytm యాప్‌ని ఉపయోగించి మొదటిసారిగా విద్యుత్‌ను చెల్లించే వినియోగదారులకు రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆఫర్‌ను పొందాలంటే.. పేమెంట్ చేసే ముందు ‘ELECNEW200’ కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, Paytm వినియోగదారులు వారి బిల్లులను చెల్లించడానికి మల్టీ పేమెంట్ ఆప్షన్లను అందిస్తోంది. వినియోగదారులు Paytm UPI, Paytm వాలెట్, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, నెట్-బ్యాంకింగ్‌తో పేమెంట్లను ప్రారంభించవచ్చు. Paytm పోస్ట్‌పెయిడ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా యూజర్లు వారి సౌలభ్యం ప్రకారం మొత్తాన్ని చెల్లించవచ్చు.

How to pay electricity bill on Paytm :

* Paytm యాప్ లేదా Web Pageని ఓపెన్ చేయండి.
* హోమ్ పేజీలో, ‘Recharges and Bill Payments‘ ఆప్షన్ కనుగొని, దానిపై Tap చేయండి.
* ఆప్షన్ల కింద, ‘Electricity’ బిల్లును ఎంచుకోండి.
* మీ రాష్ట్రం, విద్యుత్ బోర్డుని ఎంచుకోండి.
* మీ కస్టమర్ గుర్తింపు సంఖ్య (లేదా K నంబర్, CA నెంబర్, యూజర్ సంఖ్య, అకౌంట్ సంఖ్య మొదలైనవి) రిజిస్టర్ చేయండి.
* మీరు మీ బిల్లులో మీ CA నంబర్‌ను ఎంచుకోవచ్చు.

Paytm has good news for users who pay electricity using the app

Read Also : Paytm Users : పేటీఎం అకౌంట్ లేకుండానే ఇకపై యూజర్లు డబ్బులు పంపుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

* ఆ తర్వాత ‘Proceed’ పై Click చేయండి.
* Paytm మీ బిల్లు, మొత్తాన్ని మీకు చూపుతుంది.
* బిల్లును చెల్లించేందుకు మీకు ఇష్టమైన పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని, Payment కొనసాగించండి.
* మీరు Paytm Wallet, UPI, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు.
* పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు పాప్ అప్ మెసేజ్ వస్తుంది.
* పేమెంట్ చేసిన తర్వాత మీరు రసీదుని అందుకుంటారు.
* మీరు మీ రికార్డ్ కోసం బిల్లు పేమెంట్ రసీదుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Paytm Bijlee Days ఆఫర్ BSES రాజధాని, టొరెంట్ పవర్ లిమిటెడ్, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, టాటా పవర్, భారత్‌లోని ప్రధాన కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 70 ఆపరేటర్ల నుంచి విద్యుత్ బిల్లులపై అందుబాటులో ఉంది. పేమెంట్స్ ఆపరేటర్ వినియోగదారులు వారి విద్యుత్ బిల్లు సైకిల్‌ను ట్రాక్ చేయడంలో సాయపడేందుకు ఆటోమేటిక్ పేమెంట్ అలర్ట్‌లను కూడా ఎనేబుల్ చేయడం జరిగింది.

అదనంగా, వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి Paytm ఆటో-పే ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఆటో-పే (Auto Pay) సెట్ చేసిన తర్వాత, వినియోగదారు అకౌంట్ నుంచి ప్రతి నెల బిల్లు మొత్తం తొలగించడం జరుగుతుంది. విద్యుత్ బిల్లులను ట్రాక్ చేయడం లేదా చివరి తేదీ మిస్ కాకుండా ఆటోమాటిక్‌గా పేమెంట్ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Paytm Cashback Offer : పేటీఎంతో మీ LPG సిలిండర్లను బుకింగ్ చేస్తే.. క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. బుకింగ్ ఎలా చేయాలి? ట్రాకింగ్ ప్రాసెస్ ఇదిగో..!

ట్రెండింగ్ వార్తలు