Paytm UPI Lite : ఐఫోన్ యూజర్లు పేటీఎంలో యూపీఐ PIN లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Paytm UPI Lite : పేటీఎం యూపీఐ LITE ఇప్పుడు ఐఫోన్ (iOS) యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ప్రతిసారీ పిన్‌ను ఎంటర్ చేయకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు.

Paytm UPI Lite : ఐఫోన్ యూజర్లు పేటీఎంలో యూపీఐ PIN లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Paytm now allows iPhone users to make payments without UPI PIN, here is how

Paytm UPI Lite : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. iOS ప్లాట్‌ఫారమ్‌ల కోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (Paytm Payments Bank) పేటీఎం యూపీఐ లైట్ (Paytm UPI Lite) సపోర్ట్‌ను అందించింది. ఈ UPI లైట్ ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు UPI PINని ఎంటర్ చేయకుండా సురక్షితమైన పేమెంట్లు చేసుకోవచ్చు. iOS యూజర్ల కోసం UPI లైట్ సపోర్ట్‌తో పాటు, Paytm UPIలో RuPay క్రెడిట్ కార్డ్, స్ప్లిట్ బిల్లు (Split Bill), మొబైల్ నంబర్‌లను దాచే అల్ట్రానేట్ (UPI ID)లో కొత్త ఫీచర్లను కూడా రిలీజ్ చేసింది.

సెప్టెంబరు 2022లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా పేటీఎంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్ సిస్టమ్ అందించే UPI Lite అనే వెర్షన్‌గా రిలీజ్ అయింది. ఈ UPI Lite అనేది చిన్న మొత్తంలో లావాదేవీలను ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో కిరాణా సామాగ్రి లేదా తక్కువ ధర కలిగిన ఒకే వస్తువులను కొనుగోలు చేయొచ్చు.

UPI లైట్ అంటే ఏంటి? :
యూపీఐ లైట్ డివైజ్‌లో వ్యాలెట్ క్రియేట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. రూ. 2,000 వరకు లిమిట్ అందిస్తుంది. పేటీఎం సహా ఇతర పేమెంట్ల యాప్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. పేటీఎం యాప్‌లో UPI లైట్‌ని అందించిన ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్.. ఇప్పుడు iOS ప్లాట్‌ఫారమ్‌లకు UPI లైట్‌ని కూడా తీసుకువచ్చింది.

Read Also : Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!

UPI లైట్‌ని సెటప్ చేసిన తర్వాత యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్‌స్టంట్, సేఫ్ పేమెంట్లను రూ. 200 వరకు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఒక యూజర్ రోజుకు రెండుసార్లు UPI లైట్‌కి రూ. 2వేల వరకు బ్యాలెన్స్ వేసుకోవచ్చు. మొత్తం రోజువారీ వినియోగం రూ. 4వేల వరకు ఉండవచ్చు.

ఐఫోన్‌లో Paytm UPI లైట్‌ని ఎలా వాడాలంటే? :
UPI లైట్‌ని ఉపయోగించడానికి యూజర్లు తమ Paytm వ్యాలెట్లో నగదును డిపాజిట్ చేయాలి. ఆపై వారు పేమెంట్ చేయాలనుకునే మర్చంట్ QR కోడ్‌ను స్కాన్ చేయాలి. పేమెంట్ ఇన్‌స్టంట్, పిన్ అవసరం లేకుండానే ప్రాసెస్ అవుతుంది. Paytm UPI లైట్ ద్వారా లావాదేవీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Paytm now allows iPhone users to make payments without UPI PIN, here is how

Paytm now allows iPhone users to make payments without UPI PIN

* Paytm యాప్‌ను ఓపెన్ చేయండి.
* హోమ్ స్క్రీన్‌పై ఉన్న ‘UPI Lite’ ఐకాన్‌పై నొక్కండి.
* మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేసి confirm చేయండి.
* మీ UPI లైట్ వ్యాలెట్‌కు నగదును యాడ్ చేయండి.
* పేమెంట్ చేయడానికి, ‘UPI Lite‘ ఆప్షన్ ఎంచుకోండి.
* రీసీవర్ UPI IDని ఎంటర్ చేయండి లేదా QR కోడ్‌ని స్కాన్ చేయండి.
* మీరు పేమెంట్ చేయాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయండి.
* Payment’పై Tap చేయండి.

UPI లైట్‌ని వాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు :

* మీ UPI లైట్ వ్యాలెట్‌కు గరిష్టంగా మొత్తం రూ. 2,000 వరకు లోడ్ చేయగలరు.
* UPI లైట్‌ని ఉపయోగించి మీరు పేమెంట్ చేసే గరిష్ట మొత్తం ప్రతి లావాదేవీకి రూ.200 మాత్రమే.
* మీరు UPI లైట్‌ని ఉపయోగించి రోజుకు గరిష్టంగా 20 లావాదేవీలు చేయవచ్చు.
* UPI లైట్ ఈ ఫీచర్‌కు సపోర్టు చేసే బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Paytm UPI Lite ఫీచర్‌కి 3-లెవల్ బ్యాంక్-గ్రేడ్ సెక్యూరిటీని అందిస్తుందని పేటీఎం పేర్కొంది. బ్యాంక్ పాస్‌బుక్‌లో వ్యక్తిగత పేమెంట్లను చూపకుండా సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. UPI లైట్ బ్యాలెన్స్‌ని యాడ్ చేసేందుకు ఒక్క ఎంట్రీని మాత్రమే చూపుతుంది. వినియోగదారుకు క్లీన్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అందిస్తుంది. Paytm UPI లైట్‌కి Paytm పేమెంట్స్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా 13 బ్యాంకులు సపోర్టు అందిస్తున్నాయి.

Read Also : Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 7a లాంచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?