Paytm Cashback Offer : పేటీఎంతో మీ LPG సిలిండర్లను బుకింగ్ చేస్తే.. క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. బుకింగ్ ఎలా చేయాలి? ట్రాకింగ్ ప్రాసెస్ ఇదిగో..!

Paytm Cashback Offer : ప్రముఖ డిజిటల్ పేమెంట్ (Paytm) ప్లాట్‌ఫాం కంపెనీ పేటీఎం తమ యూజర్లు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం యాప్ ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.

Paytm Cashback Offer : పేటీఎంతో మీ LPG సిలిండర్లను బుకింగ్ చేస్తే.. క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. బుకింగ్ ఎలా చేయాలి? ట్రాకింగ్ ప్రాసెస్ ఇదిగో..!

Paytm offering cashback on booking LPG cylinders through the app_ how to book and track

Paytm Cashback Offer : ప్రముఖ డిజిటల్ పేమెంట్ (Paytm) ప్లాట్‌ఫాం కంపెనీ పేటీఎం తమ యూజర్లు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం యాప్ ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ముఖ్యంగా.. పేటీఎం యూజర్లు ఎవరైతే.. తమ LPG సిలిండర్లను యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటారో వారికి ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అందులో Bharatgas, Indane, HP గ్యాస్ అంతటా LPG సిలిండర్ బుకింగ్‌పై యూజర్లకు Paytm అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది. డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం Paytm మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. Paytm వ్యాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్‌పై రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనంగా, యాప్ బుకింగ్‌ను ట్రాక్ చేసేందుకు కూడా వినియోగదారులను అనుమతిస్తుంది.

Paytm offering cashback on booking LPG cylinders through the app_ how to book and track

Paytm offering cashback on booking LPG cylinders through the app

LPG సిలిండర్‌లను బుక్ చేసుకునే కొత్త యూజర్లకు Paytm మంగళవారం అద్భుతమైన క్యాష్‌బ్యాక్ డీల్స్ ప్రకటించింది. కొత్త పేటీఎం యూజర్లు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందాలంటే “FIRSTGAS” కోడ్‌ని ఉపయోగించవచ్చు. అంతేకాదు.. వినియోగదారులు Paytm వ్యాలెట్ ఉపయోగించి సిలిండర్‌ల బుకింగ్‌పై రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్ పొందేందుకు “WALLET50GAS” కోడ్‌ని ఉపయోగించవచ్చు. Paytm వినియోగదారులను రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను ఉపయోగించి సౌకర్యవంతంగా అదనపు ఛార్జీలతో గ్యాస్ రీఫిల్‌లను బుక్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : Airtel 5G in India : దేశంలో 12 నగరాల్లోకి Airtel 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. మీ నగరం ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!

బుకింగ్ ప్రాసెస్‌తో పాటు బుక్ చేసిన సిలిండర్‌ల డెలివరీ ప్రక్రియను చూపే యాప్‌లో ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ బుకింగ్‌ను ట్రాక్ చేయవచ్చు. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత.. యాప్ బుకింగ్ వివరాలను కూడా Save చేస్తుంది, తద్వారా కొత్త బుకింగ్‌ను ప్రాసెస్ చేసేందుకు వినియోగదారులు 17-అంకెల LPG IDని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. Paytm ద్వారా మీ LPG గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Paytm offering cashback on booking LPG cylinders through the app_ how to book and track

Paytm offering cashback on booking LPG cylinders through the app

Paytm యాప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే? :
* Paytm యాప్‌ని ఓపెన్ చేయండి. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కేటగిరీ కింద ‘Book Gas Cylinder’ ట్యాబ్‌కు వెళ్లండి.
* ఇప్పుడు LPG సిలిండర్ సర్వీస్ ప్రొవైడర్‌ని ఎంచుకోవాలి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ 17-అంకెల LPG ID/కన్స్యూమర్ నంబర్‌ను నమోదు చేయండి.
* పేమెంట్ చేయడం ద్వారా మీ బుకింగ్‌ను కొనసాగించండి.
* మీరు Paytm Wallet, Paytm UPI, కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్ వంటి మీకు ఇష్టమైన పేమెంట్ మోడ్‌లలో దేనినైనా చెల్లించవచ్చు.

ముఖ్యంగా, Paytm వినియోగదారులు Paytm పోస్ట్‌పెయిడ్‌తో గ్యాస్‌ను బుక్ చేసుకోవాలంటే.. వచ్చే నెలలో సున్నా వడ్డీ, జీరో జాయినింగ్ ఫీజుతో చెల్లించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. అదనంగా, Paytm యూజర్లు IVRS లేదా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ల కోసం కూడా చెల్లించవచ్చు.
* మీ బుకింగ్ ధృవీకరించినట్టు మెసేజ్ రాగానే.. మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : RBI Digital Rupee : డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది.. డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి.. ఫస్ట్ 4 నగరాల్లో ప్రారంభం.. ఆర్బీఐ కీలక ప్రకటన!