అంగారకుడిపై జీవం అన్వేషణ మొదలుపెట్టిన పర్సెవరెన్స్‌ రోవర్‌

గత నెలలో మార్స్ ఉపరితలాన్ని తాకిన తర్వాత నాసా రోవర్.. ఇప్పుడు అధికారికంగా అక్కడి జీవంపై పరిశోధన మొదలుపెట్టింది. పురాతన గ్రహాంతర జీవన ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది.

అంగారకుడిపై జీవం అన్వేషణ మొదలుపెట్టిన పర్సెవరెన్స్‌ రోవర్‌

Perseverance Is Now Officially Searching For Life On Mars (1)

Perseverance officially searching for life on mars : అంగారకుడిపై జీవ అన్వేషణ కోసం ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ అంగారక ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది. గత నెలలో మార్స్ ఉపరితలాన్ని తాకిన తర్వాత నాసా రోవర్.. ఇప్పుడు అధికారికంగా అక్కడి జీవంపై పరిశోధన మొదలుపెట్టింది. పురాతన గ్రహాంతర జీవన ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది.

ఎజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్సే ప్రకారం.. నాసా రోవర్.. ఇప్పటికే మార్టిన్ రాళ్లు, నేల మొదటి నమూనాలను సేకరించింది. 2031లో, అంగారకుడి నుంచి భూమికి తిరిగి రానుంది. అంగారక గ్రహం ఒకప్పుడు సూక్ష్మజీవుల జీవితానికి ఆతిథ్యం ఇచ్చిందా లేదా అనేది నాసా సైంటిస్టులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అంతేకాదు.. అంగారక గ్రహం మనుషులు జీవించేందుకు అనువైనదా కాదా? అనేది కూడా తేల్చనున్నారు.

Perseverance is now officially searching for life on mars

ఇదే విషయంలో నాసా రోవర్ సొంత విశ్లేషణ చేయనుంది. సూపర్ కామ్ సూట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్.. అంగారకుడిపై మొదటి నమూనాలను సేకరించడానికి సాయపడుతుంది. రోవర్ ఫొటోలను తీయడమే కాకుండా అక్కడి పరిసరాలను అధ్యయనం చేయనుంది.

రోవర్ లో రాళ్లను గుర్తించే స్కూపర్లు, కెమెరాతో పాటు అంగారకుడిపై పర్యావరణపు రసాయనాలను లేజర్ సహా ఇతర టూల్స్ ద్వారా అధ్యయనం చేయనుంది. మిషన్ సెర్చ్ లో భాగంగా.. మార్స్ నమూనాలను రెండు డజనుకు పైగా సీలు వేసిన గొట్టాలలోకి పంపిస్తుంది. చివరికి రాళ్లు, మట్టిని తిరిగి భూమికి పంపిస్తుంది.