iPhone Heating Issues : ఐఫోన్‌లో iOS 16.4.1 అప్‌డేట్ చేశారా? మీ ఫోన్ వెంటనే హీటెక్కుతోందా? ఈ టిప్స్ తప్పక పాటించండి!

iPhone Heating Issues : మీ ఐఫోన్ హీట్ అవుతుందా? ఛార్జింగ్ పెట్టిన వెంటనే వేడిక్కుతుందా? అయితే తస్మాత్ జాగ్త్రత్త.. మీ ఐఫోన్ హీటెక్కడానికి అసలు కారణం ఇదే...

iPhone Heating Issues : ఐఫోన్‌లో iOS 16.4.1 అప్‌డేట్ చేశారా? మీ ఫోన్ వెంటనే హీటెక్కుతోందా? ఈ టిప్స్ తప్పక పాటించండి!

Phone Heating Issues _ Facing heating issues on your iPhone after installing iOS 16.4.1

Phone Heating Issues : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఏప్రిల్ ప్రారంభంలో ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం (iOS 16.4.1) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. అందులో సిరి (Siri) ఫీచర్ సహా కొన్ని సమస్యల పరిష్కారానికి iOS 16.4.1 అప్‌డేట్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే.. ఈ అప్‌డేట్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఐఫోన్ యూజర్లకు తమ హ్యాండ్‌సెట్ క్రాష్ కావడం, వెంటనే వేడెక్కడం వంటి సమస్యలు తలెత్తినట్టు రిపోర్టు చేశారు. ZDNet నివేదిక ప్రకారం.. ఈ హీటింగ్ సమస్య ఎక్కువగా ఆపిల్ (iPhone 14 Pro), iPhone 14 Pro Max మోడల్‌ వాడే యూజర్లకు ఎదురైంది.

అయినప్పటికీ ఇతర iPhone యూజర్ల నుంచి ఇలాంటి హీటింగ్ సమస్యకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. తమ ఐఫోన్ డివైజ్‌లను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే ఐఫోన్ యూజర్లు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు మాత్రమే హీటింగ్ సమస్య ఉందని నివేదిక తెలిపింది. ఈ సమస్యను ఫిక్స్ చేసేందుకు కంపెనీ నెక్స్ట్ అప్‌డేట్‌ రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే, అప్పటివరకు, ఐఫోన్ యూజర్లు తమ ఐఫోన్‌లు వేడి ఎక్కకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

Read Also :  Apple iphones List : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఈ ఐఫోన్ మోడల్స్ కనిపించవు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Phone Heating Issues _ Facing heating issues on your iPhone after installing iOS 16.4.1

Phone Heating Issues _ Facing heating issues on your iPhone after installing iOS 16.4.1

ఐఫోన్ ఛార్జింగ్ సమయంలో వైర్డ్ ఛార్జింగ్‌ని ఆప్షన్ మాత్రమే ఎంచుకోండి. అప్పుడు హీటింగ్ సమస్య తక్కువగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కచ్చితంగా డివైజ్ వేడిని చాలావరకూ తగ్గిస్తుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ ఐఫోన్ ఉన్న కేస్‌ను కూడా తొలగించండి. అది రబ్బర్ అయితే.. హీట్ కారణంగా కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యను ఎదుర్కొనే ఐఫోన్ యూజర్లు వేడిని నివారించడానికి ఐఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాక్ కేస్‌ను తీసివేయడం చాలా మంచిది. రాత్రిపూట ఛార్జింగ్‌ను కూడా అసలే పెట్టవద్దు. పైన పేర్కొన్న విధంగా పాటించాల్సి ఉంటుంది. ఆపిల్ రిలీజ్ చేసిన iOS 16.4.1 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ iPhone దుర్బలత్వానికి దారితీసింది. ఐఫోన్‌లలో (IOSsurfaceAccelerator) అనే భద్రతా లోపం ఉంది. కెర్నల్ ద్వారా ఏకపక్ష కోడ్‌ని అమలు చేసేందుకు అందులోని యాప్‌ను అనుమతించింది.

అదేవిధంగా, వెబ్‌కిట్ దుర్బలత్వం అనేది రూపొందించిన వెబ్ కంటెంట్‌కు దారితీయవచ్చు. తద్వారా ఏకపక్ష కోడ్ అమలుకు దారితీయవచ్చు. ఐఫోన్‌లోని సఫారి బ్రౌజర్‌ ద్వారా ఎక్కువ ప్రైవసీ ముప్పు ఉంది. అందుకే సాధ్యమైనంతవరకు అది వాడకపోవడమే బెటర్ అని ఆపిల్ తెలిపింది. iOS 16.4.1 అప్‌డేట్ (Apple iPhone 8), రాబోయే కొత్త మోడల్‌లను కలిగి ఉంది. iPadOS 16.4.1కి సపోర్టు చేసే డివైజ్‌లలో iPad Pro (అన్ని మోడల్‌లు), iPad Air 3వ జనరేషన్, ఆ తరువాత, iPad 5వ జనరేషన్, ఆ తరువాతి, iPad mini 5వ జనరేషన్ వంటి మోడల్స్ ఉన్నాయి.

Read Also : Apple iPhone 14 : అక్షయ తృతీయ ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!