JioPhone Next: దీపావళికి జియో కానుక.. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటన

దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది.

JioPhone Next: దీపావళికి జియో కానుక.. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటన

Sundhar Pichai

JioPhone Next: దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది. కంపెనీ 4G స్మార్ట్‌ఫోన్ JioPhone నెక్స్ట్‌ను మార్కెట్లోకి తీసుకుని రాబోతుంది. నవంబర్ 4వ తేదీన ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. చాలా తక్కువ ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.3499గా ఉంటుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. గూగుల్ భాగస్వామ్యంతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తుండగా.. ఆండ్రాయిడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ వస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, కెమెరా ఫిల్టర్‌లతో పాటు ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన జియో యాప్‌లు ఉండనున్నాయి.

జూన్​24న జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్​ఐఎల్​ ఛైర్మన్ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ముఖేష్​ అంబానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్​ఫోన్​ను అందించబోతున్నట్లు ప్రకటించారు. మేక్​ ఇన్​ ఇండియా చొరవతో తక్కువ ధరలోనే దీన్ని రూపొందించారు. దేశంలోని 30కోట్ల 2జీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 4G వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.

Reliance JioPhone Next Specifications:

Processor Qualcomm Snapdragon 215
Display 5.5 inches (13.97 cms)
Storage 16 GB
Front Camera Single (8 MP Camera)
Rear Camera Single (13 MP Camera)
Battery 2500 mAh
RAM 2 GB
Processor:
Chipset Qualcomm Snapdragon 215
No of Cores 4 (Quad Core)
CPU Quad core, 1.4GHz, Cortex A53
Graphics Adreno 308
Software:
Operating System Android v11
Custom UI Android Go

Storage:

Internal Memory 16 GB
RAM 2 GB
Expandable Memory Yes, microSD, Up to 128 GB (Dedicated)

Display:

Display Type LCD
Resolution 720 x 1440 pixels
Size 5.5 inches (13.97 cms)
Aspect ratio 18:9
TouchScreen Yes, Capacitive, Multi-touch
Color Reproduction 16M Colors
Pixel Density 293 pixels per inch (ppi)

Camera:

Flash Rear (LED Flash)
Rear Single (13 MP Camera)
Front Single (8 MP Camera)

Battery:

Type Li-ion
Capacity 2500 mAh
Removable No
Wireless Charging No

Connectivity:

Bluetooth Bluetooth
Wi-Fi Yes with b/g/n
SIM Configuration Dual SIM (SIM1: Nano) (SIM2: Nano)
Network 4G: Available (supports Indian bands), 3G: Available, 2G: Available
Voice over LTE(VoLTE) Yes
Wi-fi features Mobile Hotspot
GPS Yes
USB microUSB 2.0, Mass storage device, USB charging
NFC Chipset No

Sensors:

Fingerprint sensor No
Other Sensor Accelerometer

Sound:

Speaker Yes
Audio Jack Yes, 3.5mm