60 లక్షల మంది ఫేస్ బుక్ వినియోగదారుల ఫోన్ నెంబర్లు సేల్

60 లక్షల మంది ఫేస్ బుక్ వినియోగదారుల ఫోన్ నెంబర్లు సేల్

Facebook users up for sale : సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషించే ఫేస్ బుక్..వినియోగదారులకు సంబంధించి…ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి ఉన్నాయనే విషయం సంచలనం సృష్టిస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరిట ట్విట్టర్ ఖాతా నిర్వహించే..సైబర్ నిపుణులు అలొన్ గాల్ భారత్ లోని ఫేస్ బుక్ వినియోగదారులకు సంబంధించిన ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. అమ్మకానికి పెట్టిన వ్యక్తి ఏకంగా 533 మిలియన్ మంది ఫేస్ భుక్ ఖాతాదారుల సమాచారం కూడా ఉన్నట్లు తెలిపారు.

సోషల్ మీడియా ఖాతాలు, వాటి ఫోన్ నెంబర్లతో హ్యాకర్ డేటాబేస్ ను తయారు చేసుకున్నాడని, వాటినే ఇప్పుడు విక్రయానికి పెట్టాడని తెలిపారు. ఒక్కో ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి 5 డాలర్లు, డేటా గురించి తెలుసుకోవాలంటే…5 వేల డాలర్లు ఇవ్వాలని హ్యాకర్ షరతు విధించాడన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు వీటిని హ్యాకర్ విక్రయానికి పెట్టాడని అలొన్ గాల్ వెల్లడించారు. 2019లో ఫేస్ బుక్ లో ఉన్న ఓ లోపాన్ని సవరించినా..అప్పటికే అతడు ఈ సమాచారాన్ని మొత్తం సేకరించి పెట్టుకున్నాడన్నారు. సోషల్‌ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.