Upcoming 5G Phones : అక్టోబర్‌లో రానున్న కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫోన్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలుసా?

Upcoming 5G Phones : 2022 ఏడాదిలో ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇంకా కొన్ని 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్‌కు రెడీగా ఉన్నాయి. మీరు చదివింది నిజమే. గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ 7 సిరీస్‌ (Pixel 7 Series)ను అక్టోబర్‌లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.

Upcoming 5G Phones : అక్టోబర్‌లో రానున్న కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫోన్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలుసా?

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

Upcoming 5G Phones : 2022 ఏడాదిలో ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇంకా కొన్ని 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్‌కు రెడీగా ఉన్నాయి. మీరు చదివింది నిజమే. గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ 7 సిరీస్‌ (Pixel 7 Series)ను అక్టోబర్‌లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi) ఇప్పుడు కొత్త Xiaomi 12T ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కూడా రాబోతున్నాయని వెల్లడించింది. వచ్చే నెలలో Moto G72 లాంచ్‌ అయ్యేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ప్లాట్ ఫారంలు ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 30తో ఈ కామర్స్ సేల్ కూడా ముగియనుంది. వచ్చే అక్టోబర్ 2022లో మరికొన్ని స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. 5G స్మార్ట్‌ఫోన్ల లిస్టుకు సంబంధించి జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంచుకుని సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి.

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

అక్టోబర్ 2022లో 5G ఫోన్‌ల జాబితా ఇదే :

Pixel 7- Pixel 7 Pro :
గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త 7 సిరీస్ రాబోతోంది. Pixel 7 Series అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఈ కొత్త పిక్సెల్ 7 ఫోన్‌లు (Pixel 7, Pixel 7 Pro) కూడా భారత మార్కెట్లోకి రానున్నాయని గూగుల్ ధృవీకరించింది. కంపెనీ రివీల్ చేసిన డేటా ప్రకారం.. రాబోయే పిక్సెల్ 7 సిరీస్ పాత డిజైన్‌ను మాదిరిగానే ఉంటాయని అంచనా. ఈ సిరీస్‌లో ఫీచర్లల పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది. పిక్సెల్ 7 సిరీస్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో కంపెనీ రివీల్ చేయలేదు. మునుపటి మోడల్‌లలో మాదిరిగానే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుందని అంచనా.

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

పిక్సెల్ 6 కన్నా ప్రామాణిక మోడల్ మరింత కాంపాక్ట్‌గా ఉంటుందని, ప్రో మోడల్ అదే స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుందని లీక్‌లు సూచించాయి. Pixel 7 Pro మోడల్ 6.7-అంగుళాల 120Hz ప్యానెల్‌ను కలిగి ఉండనుంది. సాధారణ వెర్షన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. Google కొత్త హై-ఎండ్ హ్యాండ్‌సెట్‌ల కోసం Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని తీసుకొచ్చే అవకాశం లేదు. కొత్త పిక్సెల్ ఫోన్‌లు గూగుల్ సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. Pixel 7 సిరీస్ ఆండ్రాయిడ్ 13 OSలో రన్ అవుతుంది. బ్యాటరీపై ఎలాంటి సమాచారం లేదు. కొత్త మోడల్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో పెద్ద యూనిట్‌లను అందించనున్నాయి.

పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో.. 50-MP ఐసోసెల్ GN1 ప్రధాన వెనుక కెమెరా సెన్సార్‌లతో రానున్నాయని లీక్‌లు పేర్కొన్నాయి. రెగ్యులర్ వెర్షన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించే అవకాశం ఉంది. ప్రధాన సెన్సార్‌తో పాటు 12-MP సోనీ IMX381 అల్ట్రావైడ్ సెన్సార్ ఉండవచ్చు. పిక్సెల్ 6 లైనప్‌లోనూ అదే చూశాము. మరోవైపు.. Pixel 7 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉందని, 48-MP శాంసంగ్ GM1 టెలిఫోటో సెన్సార్ ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రంట్ సైడ్ 11-MP మోడల్ Samsung 3J1 సెన్సార్‌ను చూడవచ్చు. పిక్సెల్ 7 భారత మార్కెట్లో ధర రూ. 60వేల లోపు ఉండవచ్చని అంచనా.

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

Pixel 7 to Moto G72 List of phones launching in October 2022

Moto G72 :
Motorola కొత్త Moto G72 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 3న భారత మార్కెట్లో లాంచ్ కానుందని ప్రకటించింది. ఈ డివైజ్ సాధారణ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. Moto G72 కోసం ఫ్లిప్‌కార్ట్ జాబితా ప్రకారం.. హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G99 SoCని ప్యాక్ చేస్తుంది. దీనికి 6GB RAM, 128GB స్టోరేజ్ సపోర్టు ఉంటుంది. 10-బిట్ OLED స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 576Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, 1,300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో ప్రధాన కెమెరా కాకుండా అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, మాక్రో యూనిట్ కూడా ఉంటాయి. Moto G72 స్టీరియో స్పీకర్లతో కూడా రానుంది. డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రానుంది. హుడ్ కింద 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. వాటర్ రిసిస్టెంట్ ప్రొటెక్షన్ IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉండనుంది.

Pixel 7 to Moto G72 List of 5G phones launching in October 2022

Pixel 7 to Moto G72 List of 5G phones launching in October 2022

Xiaomi 12T, Xiaomi 12T Pro :
Xiaomi 12T సిరీస్ ఎంపిక చేసిన మార్కెట్లలో అక్టోబర్ 4న లాంచ్ చేయనుంది. Xiaomi 12T స్మార్ట్‌ఫోన్ రెగ్యులర్, ప్రో వెర్షన్ రెండింటినీ కంపెనీ రిలీజ్ చేయబోతోంది. ప్రీమియం వెర్షన్ వెనుక 200-MP ప్రైమరీ Samsung ISOCELL HP1 కెమెరా సెన్సార్‌తో వస్తుంది. Moto Edge 30 Ultraలో కూడా అదే సెన్సార్‌ ఉంది. షావోమీ ప్రో వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో రానుందని లీక్ డేటా తెలిపింది. అయితే ప్రామాణిక మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 SoC నుండి పవర్ అందిస్తుందని తెలిపింది. రెండు 5G ఫోన్‌లు సాధారణ 5,000mAh బ్యాటరీతో వచ్చాయని భావిస్తున్నారు. కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Xiaomi 12T Series : షావోమీ నుంచి రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!