Poco C50 : ఇండియాకు పోకో C50 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెలాఖరులోనే అధికారికంగా లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Poco C50 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో (Poco) నుంచి భారత మార్కెట్లోకి త్వరలో కొత్త పోకో ఫోన్ వస్తోంది.. Poco C50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నవంబర్ చివరి వారంలో లాంచ్ కానుంది.

Poco C50 : ఇండియాకు పోకో C50 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెలాఖరులోనే అధికారికంగా లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Poco C50 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో (Poco) నుంచి భారత మార్కెట్లోకి త్వరలో కొత్త పోకో ఫోన్ వస్తోంది.. Poco C50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నవంబర్ చివరి వారంలో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అయితే Poco C50 కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో బ్రాండ్ Poco C40ని గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. కానీ, భారతీయ మార్కెట్లో లాంచ్ చేయలేదు. కంపెనీ నేరుగా భారత మార్కెట్లో C50 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.

Poco లేటెస్ట్ స్టార్ కెమెరా పర్ఫార్మెన్స్, మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్, ఆకర్షణీయమైన డిజైన్‌తో రానుంది. ఈ పోకో డివైజ్ బ్యాటరీ లైఫ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. Poco ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను రివీల్ చేయలేదు. Poco C40 మోడల్‌కు సమానమైన కొన్ని స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని భావించవచ్చు.

Poco C50 will officially launch in India by end of this month

Poco C50 will officially launch in India by end of this month

Poco C40 HD+ రిజల్యూషన్‌తో పనిచేసే భారీ 6.71-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ JLQ JR510 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. కొత్త స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ SoCతో రానుందని భావిస్తున్నారు. Poco C40 4GB వరకు RAM, 64GB వరకు స్టోరేజీతో అమ్మకానికి రానుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీని విస్తరించుకునే అవకాశాన్ని కూడా కంపెనీ ఇచ్చింది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 13-MP ప్రైమరీ సెన్సార్, 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం.. 5-MP కెమెరా సెన్సార్ ఉంది. హుడ్ కింద.. 6,000mAh బ్యాటరీని పొందవచ్చు. కానీ, Poco 18W ఫాస్ట్ ఛార్జర్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు చాలా సమయం పడుతుంది.

Poco C50 will officially launch in India by end of this month

Poco C50 will officially launch in India by end of this month

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అని బ్రాండ్ ధృవీకరించింది. Poco C50 కూడా సరసమైన ధరకు అందుబాటులో ఉంటుందని సూచిస్తుంది. Poco నుంచి Poco C31, Poco C3 ఫోన్‌లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించిందని కంపెనీ వెల్లడించింది. ఈ డివైజ్‌లు ఇప్పటి వరకు భారీ అమ్మకాలను నమోదు చేశాయని కంపెనీ తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Xiaomi New Laptops : భారత్‌లో షావోమీ నుంచి త్వరలో రెండు కొత్త ల్యాప్‌టాప్స్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?