Poco F4 5G : పోకో నుంచి కొత్త 5G ఫోన్.. లాంచింగ్ ముందే కీ ఫీచర్లు లీక్..!

పోకో నుంచి 5G ఫోన్ త్వరలో రాబోతోంది. భారత మార్కెట్లోకి Poco F4 ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు లీకయ్యాయి.

Poco F4 5G : పోకో నుంచి కొత్త 5G ఫోన్.. లాంచింగ్ ముందే కీ ఫీచర్లు లీక్..!

Poco F4 5g Key Specs Confirmed Ahead Of Official Launch All You Need To Know (1)

Poco F4 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G ఫోన్ త్వరలో రాబోతోంది. భారత మార్కెట్లోకి Poco F4 5G ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు లీకయ్యాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 870 చిప్‌సెట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. OnePlus 9R 5G, iQoo Neo 6 5G సరసమైన ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోన్లను అందిస్తున్నాయి. రాబోయే Poco F4 5G 3,112mm sq ఏడు-లేయర్డ్ గ్రాఫైట్ షీట్‌లతో లిక్విడ్‌కూల్ 2.0 కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. గేమింగ్ సెషన్‌లలో స్మార్ట్‌ఫోన్ హై పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు. మెమరీ, స్టోరేజ్ పరంగా చూస్తే.. Poco F4 ఫోన్  కనీసం 12GB LPDDR5 RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో రానుందని Poco వెల్లడించింది.

Poco F4 5g Key Specs Confirmed Ahead Of Official Launch All You Need To Know

Poco F4 5g Key Specs Confirmed Ahead Of Official Lau

ఈ స్మార్ట్‌ఫోన్ మరిన్ని స్టోరేజ్ మోడల్స్ అందించే అవకాశం ఉంది. అయితే, 12GB RAM, 256GB స్టోరేజ్ యూనిట్ ఖరీదు ఎక్కువగా ఉండొచ్చు. కెమెరాలు, డిస్‌ప్లేకు సంబంధించి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. Poco F4 5G ఫోన్ ఫీచర్లకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ రంగు వేరియంట్‌ ఆకర్షణీయంగా ఉంది. బ్లాక్ లేదా స్పెషల్ పోకో ఎల్లో వంటి మరిన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. లీకైన ఫొటోల ఆధారంగా బ్లాక్ రిక్టయాంగిలర్ మాడ్యూల్, ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.. వెనుక కెమెరా మాడ్యూల్ Poco F4 OIS సపోర్టుతో వచ్చింది. 64-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఫోన్ 12 సిరీస్ మాదిరిగానే ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ తో రానుంది.

Poco F4 6.67-ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 12-ఆధారిత MIUI 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రావొచ్చు. Poco F4 ధర వివరాలు రివీల్ కాలేదు. Poco OnePlus, Samsung, iQoo ఫోన్ల మాదిరిగానే ధర ఉండే అవకాశం ఉంది. Poco గేమింగ్-సెంట్రిక్ Poco F3 GT భారత మార్కెట్లో 8GB RAM మోడల్ ధర రూ. 28,999కి అందుబాటులో ఉంది.

Read Also : Poco C40 : ఈ నెల 16న సరసమైన ధరకే పోకో C40 ఫోన్.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?