Poco F4 5G : పోకో నుంచి 5G కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే? | Poco F4 5G with 64MP OIS-enabled camera, Snapdragon 870 SoC launched in India

Poco F4 5G : పోకో నుంచి 5G కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి జూన్ 23న పోకో F4 5G ఫోన్ లాంచ్ అయింది.

Poco F4 5G : పోకో నుంచి 5G కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Poco F4 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి జూన్ 23న Poco F4 5G ఫోన్ లాంచ్ అయింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ 5G ఫోన్.. స్నాప్ డ్రాగన్ 870 SoCతో ఇండియాలో లాంచ్ అయింది. OnePlus 9R, iQOO Neo 6 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా పోకో F4 5G ఫోన్ ఫొటోలు, వీడియోలను రికార్డు చేసేందుకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 64-MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది.

ఇండియాలో పోకో F4 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో కొత్త Poco F4 5G బేస్ ధర 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 27,999 నుంచి ప్రారంభం కానుంది. 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్‌కి రూ. 33,999 వరకు ఉంటుంది. అలాగే8GB RAM, 128GB స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. దీని ధర రూ. 29,999గా ఉంది. పోకో F4 5G గ్రీన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో వస్తుంది. కంపెనీ ప్రత్యేకమైన Poco ఎల్లో కలర్ ఆప్షన్ ప్రారంభించలేదు. కొన్ని సరసమైన Poco స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే వస్తోంది.

F Smartphone Series (1)

F Smartphone Series 

స్పెసిఫికేషన్స్ :
కొత్త Poco F4 5G ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో ఫుల్-HD+ (2400×1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. వెనుక భాగంలో కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ లేకుండా గ్లాస్ ఫినిషింగ్ ఉంది. గ్లాస్ బ్యాక్ ప్యానెల్ డిస్ప్లే డాల్బీ విజన్ సపోర్టు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ యూజర్లు రాత్రిపూట చదివేటప్పుడు వారి కళ్ళకు రక్షణ కోసం MIUI 13 రీడింగ్ మోడ్‌ కూడా ఉంది. Poco F4 5G 20-MP ఫ్రంట్ కెమెరాతో ముందు ప్యానెల్‌లో స్మాల్ హోల్-పంచ్‌తో వస్తుంది. హుడ్ కింద.. పోకో F4 5G Qualcomm స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్ నుంచి 12GB వరకు LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ట్రిపుల్ వెనుక కెమెరాలు బ్లాక్ కలర్‌తో పాటు దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో ఉన్నాయి. వెనుక కెమెరా మాడ్యూల్‌లో 64-MP ప్రైమరీ కెమెరాతో పాటు 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో-లెన్స్ ఉన్నాయి. Poco F4 5Gలోని కెమెరా యాప్ పోర్ట్రెయిట్, పనోరమా, ప్రో మోడ్, HDR, AI సీన్ డిటెక్షన్, మూవీ ఫ్రేమ్, ప్రో కలర్, టిల్ట్-షిఫ్ట్, డాక్యుమెంట్ మోడ్ వంటి మోడ్‌లతో వచ్చింది.

ప్రధాన వెనుక కెమెరా కూడా 60fps వరకు 4K వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ 1080p రిజల్యూషన్‌తో వచ్చింది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, డ్యూయల్-సిమ్ కార్డ్ ట్రే హెడ్‌ఫోన్ జాక్ లేవు. Poco F4 5G 65W ఛార్జర్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. Poco 7.7mmతో కూడిన Poco F4 5G డిజైన్‌ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13తో రన్ అవుతుంది.

Read Also : Facebook : ఫేస్‌బుక్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!

×