Cybercrime: సైబర్ క్రైమ్ నుంచి మీ డివైజ్‌ను కాపాడుకోండిలా

ఫిషింగ్ అనేది ఒక మోసపూరిత చర్య. సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారంలోకి ప్రవేశించడానికి మనల్ని మోసం చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఫిషింగ్ ద్వారా, మోసగాళ్ళు యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాల వంటి డేటాను దొంగిలిస్తారు.

Cybercrime: సైబర్ క్రైమ్ నుంచి మీ డివైజ్‌ను కాపాడుకోండిలా

Cyber Crime

 

Cybercrime: ఫిషింగ్ అనేది ఒక మోసపూరిత చర్య. సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారంలోకి ప్రవేశించడానికి మనల్ని మోసం చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఫిషింగ్ ద్వారా, మోసగాళ్ళు యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాల వంటి డేటాను దొంగిలిస్తారు. లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తిగత వివరాలు లూటీ అయిపోతాయి.

కొవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఫిషింగ్ దాడుల కేసులు భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్స్ .. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కూడా 2021లో భారతదేశంలో ఫిషింగ్ సంఘటనల సంఖ్య బాగా పెరిగిందన్నారు. మొత్తం ఫిషింగ్ సంఘటనల సంఖ్య 2020లో 280 నుండి 2021లో 523కి పెరిగింది.

అటువంటి వాటి నుంచి రక్షణ కోసం

తక్షణ చర్యను అభ్యర్థించే సందేశాలు/ఇమెయిల్‌లు
భయపెట్టే సందేశాలు/ఈమెయిల్‌లు పంపి.. వెంటనే క్లిక్ చేయండంటూ బ్లింక్ అవుతుంటాయి. మెసేజ్‌లోని కంటెంట్‌ను సరిగ్గా చదవడం కోసం వెంటనే ఓకే బటన్ నొక్కేస్తే.. సైబర్ నేరస్థుల చేతికి మన డేటా ఈజీగా వెళ్లిపోతుంది.

Read Also: సైబర్ నేరాల్లో పోయిన డబ్బు రావాలంటే ఇలా చేయండి!

లాగిన్/చెల్లింపు వివరాలు అడుగుతున్నట్లుగా
లాగిన్ వివరాలు, ఆర్థిక సమాచారం లేదా ఇతర సున్నితమైన డేటాను అభ్యర్థించే ఏదైనా సందేశం లేదా ఈమెయిల్ ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిషర్లు నకిలీగా అనిపించని లాగిన్ పేజీలను సృష్టిస్తారు. నకిలీ పేజీకి మళ్లించి లాగిన్ లింక్‌తో ఇమెయిల్ లేదా సందేశాన్ని పంపుతారు. వెబ్‌సైట్ నిజమైనదని, చట్టబద్ధమైనదని నిశ్చయించుకున్న తర్వాతే సమాచారాన్ని షేర్ చేసుకోవాలి.

వెబ్ చిరునామాను చెక్ చేయాలి
URLని నిశితంగా పరిశీలించడం ద్వారా వెబ్‌సైట్ ఒరిజినలా కాదా అని తెలుసుకోవచ్చు. URL “https://” లేదా “shttp://”తో ప్రారంభమైందని నిర్ధారించుకోండి. వెబ్ చిరునామాలోని “S” వెబ్‌పేజీ సురక్షిత సాకెట్స్ లేయర్ (SSL) క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్‌తో భద్రపరచినట్లు తెలుస్తుంది. వెబ్‌సైట్‌లో వాటిలో ఏవీ లేకుంటే, ఈ సైట్‌లోని ఏదైనా డేటా అసురక్షితంగా ఉంటుంది. క్రిమినల్ థర్డ్ పార్టీలు సులభంగా ఉపయోగించవచ్చు.

కంటెంట్, డిజైన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి
ఫిషింగ్‌ని గుర్తించడానికి మరొక మార్గం వ్యాకరణం, స్పెల్లింగ్ తప్పుల కోసం వెదకడం. ఫిషింగ్ వెబ్‌సైట్‌లు సాధారణంగా పేలవమైన వాక్య నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అసలైన కంపెనీ ఉపయోగించే వృత్తిపరమైన భాషలాగా ఉండకపోవచ్చు. అదేవిధంగా, లేఅవుట్, ఫాంట్, రంగులు, తక్కువ-రిజల్యూషన్ చిత్రాల పరంగా పేలవమైన డిజైన్‌ను కలిగి ఉన్న వెబ్‌సైట్‌లను అనుమానాస్పదంగా గుర్తించాలి. .

నమ్మశక్యం కాని బహుమతులు
ఒక విధమైన క్లెయిమ్ చేసే ఈమెయిల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.