కౌంట్ డౌన్ స్టార్ట్…మరికొన్ని గంటల్లో నింగిలోకి PSLV-C48

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2019 / 03:43 PM IST
కౌంట్ డౌన్ స్టార్ట్…మరికొన్ని గంటల్లో నింగిలోకి PSLV-C48

పీఎస్‌ఎల్‌వీ సీ-48 కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం మధ్యాహ్నం 4.40 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహకనౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తోంది. భారత్‌కు చెందిన ఆర్‌ఐఎస్‌ఎటి-2బి ఆర్‌ఐ1 ఉపగ్రహంతోపాటు మరో తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఎఎస్‌ఎకు చెందిన ఆరు ఉన్నాయి.

 ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ శివన్ మంగళవారం తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ప్రయోగానికి ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు.