PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. కొద్దికాలంలోనే ఇండియాలో ఎంతో పాపులర్ అయిన పబ్ జీ బాటిల్ గేమ్ అదే స్థాయిలో వివాదాస్పదమైంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పబ్ జీ కి బానిసలుగా మారిపోయారు.

  • Published By: sreehari ,Published On : March 15, 2019 / 11:03 AM IST
PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. కొద్దికాలంలోనే ఇండియాలో ఎంతో పాపులర్ అయిన పబ్ జీ బాటిల్ గేమ్ అదే స్థాయిలో వివాదాస్పదమైంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పబ్ జీ కి బానిసలుగా మారిపోయారు.

పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. కొద్దికాలంలోనే ఇండియాలో ఎంతో పాపులర్ అయిన పబ్ జీ బాటిల్ గేమ్.. అదే స్థాయిలో వివాదాస్పదమైంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పబ్ జీ కి బానిసలుగా మారిపోయారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు పబ్ జీ మాయలోనే గడిపేస్తున్నారు. స్కూలు పిల్లలు చదువు పక్కన పెట్టేసి పబ్ జీ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇంటికి రాగానే పుస్తకం పట్టాల్సిన విద్యార్థులు స్మార్ట్ ఫోన్ చేతబట్టి పబ్ పజీ గేమ్ ఆడేస్తున్నారు.

పిల్లల చదువు పాడు అవుతోందని, ఈ గేమ్ ను బ్యాన్ చేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పబ్ జీ గేమ్ ఆడుతున్న పిల్లల్లో మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, గేమ్ ను వెంటనే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే పబ్ జీ ని బ్యాన్ చేయాలంటూ గుజరాత్ లోని రాజకోట్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ గేమ్ కు పిల్లలు ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారంటూ రాజ్ కోట్ పోలీసులు చెబుతున్నారు.
Read Also: మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

పబ్లిక్ గా పబ్ జీ.. 10మంది అరెస్ట్
పబ్ గేమ్ ను పబ్లిక్ గా ఆడుతున్నారనే కారణంతో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు గోవా రాష్ట్రం కూడా పబ్ జీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. గోవా ఐటీ మినిస్టర్.. పబ్ జీ భూతాన్ని బ్యాన్ చేయాలని అంటున్నారు. దేశవ్యాప్తంగా పబ్ జీ గేమ్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇంతకీ పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేయడం సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుత రోజుల్లో ప్రపంచంలో ఏదైనా బ్యాన్ చేయగలమా? పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేయాలని ఎందుకు అంత చర్చ జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్ జీ వీడియో గేమ్ ను బ్యాన్ చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. వాస్తవానికి ఇది సాధ్యమైనదేనా? అని ప్రశ్నించుకోవాలి. 

ప్రభుత్వం పబ్ జీ బ్యాన్ చేయాలనుకుంటే..
పబ్ జీ గేమ్ ను ఒక ప్రభుత్వం బ్యాన్ చేయాలనుకుంటే ముందుగా.. ISP (ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్) ను ప్రాంతాలవారీగా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. పబ్ జీ సర్వర్లకు కనెక్ట్ అయిన అన్నీ కమ్యూనికేషన్లను కట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఐఎస్ పీ ప్రొవైడర్లకు రిక్వెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిల్టర్లను ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ ల ఆధారంగా పబ్ జీ సర్వర్ల ట్రాఫిక్ ను ఫిల్టర్ చేయవచ్చు. పబ్ జీ సర్వర్లను బ్లాక్ చేయడానికి మరో మార్గం కూడా ఉంది. అదే.. ASN (ఆటోనమస్ సిస్టమ్ నంబర్) బ్లాకింగ్ మెథడ్. ఈ మెథడ్ ఫాలో అయితే.. ఒక పబ్ జీ సర్వర్లే కాదు.. ఇతర ఇంటర్నట్ ట్రాఫిక్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి మించి మరో మెథడ్ టెక్నాలజీ అందుబాటులో లేదు. 

VPN సర్వీసు ఒక్కటే మార్గం..
ఒకవేళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేయాలనుకుంటే.. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (VPN) సర్వీసు ఒకటి మాత్రమే ఉంది. విపిఎన్ సర్వీసుతో ట్రాఫిక్ ను గుర్తించకుండా చేయవచ్చు. అంతేకాదు.. ట్రేస్ చేయడం ఎంతో కష్టం. మీ కనెక్షన్ హ్యాక్ చేయలేరు కూడా. అంత పటిష్టంగా ఉంటుంది. జియో గ్రాఫికల్ లోకేషన్ ఆధారంగా పబ్ జీ గేమ్ కంటెంట్ ను బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు.. పబ్ జీ లైట్ వర్షన్ ప్రస్తుతం భారత్ లో అందుబాటులో లేదు. ఈ గేమ్ ప్రారంభంలో ఫిలిప్పెయిన్స్ దేశీయులకే మాత్రమే అందుబాటులో ఉండేలా తయారు చేశారు. అదే.. మనం VPN యాప్ సర్వీసు ద్వారా పబ్ జీ లైట్ గేమ్ ను యాక్సస్ చేయాలనుకుంటే.. మన ఐపీ అడ్రస్ లను మార్చుకోవాల్సి ఉంటుంది. వీపీఎస్ సర్వీసుతో జియోగ్రాఫికల్ గా ఫిలిప్పెయిన్స్ లోకేషన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఫిలిఫ్పెయిన్స్ DNS సర్వర్లతో కనెక్ట్ అయి పబ్ జీ గేమ్ లైట్ వర్షన్ ఆడొచ్చు. 

గూగుల్.. ఆపిల్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తే..
వాస్తవానికి ప్రభుత్వం పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటే మాత్రం.. పబ్ జీ గేమ్ ఆడటం కష్టమే మరి. ఇందుకోసం ప్రభుత్వం.. స్మార్ట్ ఫోన్ మేకర్ ఆపిల్, సెర్చ్ ఇంజిన్ గూగుల్ ను రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆపిల్, గూగుల్ తమ ప్లాట్ ఫాంలపై పబ్ జీ యాక్సస్ ను బ్లాక్ చేయొచ్చు. ఆపిల్ స్టోర్ పై పబ్ జీ గేమ్ యాక్సస్ ను బ్లాక్ చేయొచ్చు. ఇలా చేస్తే.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే పరిస్థితి లేకపోలేదు. అంతేకాదు.. పెద్ద స్థాయి సంస్థలు కూడా ప్రభుత్వం అభ్యర్థనను పూర్తి స్థాయిలో పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి ప్రయత్నాలు గతంలో ఎన్నోసార్లు జరిగిన సందర్భాలు అనేకం. ప్రభుత్వంతో గూగుల్, ఆపిల్ చర్చలు జరిపి.. ప్రభుత్వ డిమాండ్లకు దిగ్గజ సంస్థలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పబ్ జీ గేమ్ ను బ్యాన్ అవుతుంది. కానీ, ఇది కూడా పూర్తిస్థాయిలో సాధ్యం కాదు.. ఎందుకంటే.. ఆపిల్ యాప్స్ వాడే డివైజ్ ల్లో బైపాస్ రూటింగ్ టెక్నిక్ వాడితే.. మాత్రం పబ్ జీ గేమ్ యాప్ లను కంట్రోల్ చేయడం సాధ్యపడదు. రూటెడ్ చేసిన డివైజ్ లపై మొబైల్ మేకర్లకు కంట్రోల్ చేయలేవు. 

మనదేశంలో ఇలాంటి టెక్నిక్ సాధ్యమేనా?
పబ్ జీ గేమ్ ను పూర్తి స్థాయిలో బ్లాక్ చేయాడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి.. అవి ఏంటో ఓసారి చూద్దాం..
వైట్ లిస్టింగ్ : (నార్త్ కొరియాలో వాడారు) పబ్ జీ సర్వర్ల ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయొచ్చు. 

బ్లాకింగ్ ఎన్ క్రిప్టడ్ ట్రాఫిక్ అండ్ ఎంప్లాయింగ్ డీప్ ప్యాకెట్ ఇన్స్ ఫెక్షన్ : (చైనాలో వాడారు) ఫిక్స్ చేసిన స్థాయిలో ట్రాఫిక్ ను మాత్రమే అనుమతించడం, మొత్తం ట్రాఫిక్ ను బ్లాక్ చేయొచ్చు. 
Read Also: సెర్చ్ ఇమేజ్ ఫీచర్: మీ వాట్సాప్‌లో ఫొటోలు రియలో ఫేకో చెప్పేస్తుంది

ఈ దేశాల్లో వాడే ఈ రెండు టెక్నిక్ ను ప్రజస్వామ్య దేశమైన భారత్ లో సాధ్యం కానిపని. చైనా, నార్త కొరియా విధానాన్ని భారత్ అనుసరించే పరిస్థితి లేదు. 

పోర్న్ సైట్లు బ్యాన్.. పబ్ జీ ఎందుకు చేయలేరు ?
వెబ్ సైట్లను బ్యాన్ చేసినంత సులభంగా వీడియో గేమ్ లను బ్యాన్ చేయలేరు. ఇప్పటికే కొన్ని పోర్న్ వెబ్ సైట్లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయినప్పటికీ పోర్న్ వెబ్ సైట్లను పూర్తిగా కంట్రోల్ చేయలేదు. కారణం.. ఇంటర్నెట్ సూపర్ హైవేపై ఎన్నో షార్ట్ కట్ వేలు ఉన్నాయి. ఒక రూట్ బ్లాక్ చేస్తే.. మరో రూట్ లో కనెక్ట్ చేసే అవకాశం ఉంది. proxy సర్వర్లు ఇందుకు కారణం. Proxy సర్వర్లతో బ్లాక్ చేసిన వెబ్ సైట్లను బైపాస్ వేస్.. మళ్లీ ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది. వీపీఎన్, ప్రాగ్జీ సర్వర్లతో బ్లాక్ లేదా బ్యాన్ చేసిన వాటిని తిరిగి యాక్సస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పబ్ జీ గేమ్ ను కూడా పూర్తిస్థాయిలో బ్యాన్ చేయడం సాధ్యం కానిదని.. ఇదంతా చదివిన మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. 
Read Also: రెడీ ఫర్ షో టైం : మార్చి 25న Apple 2019 ఫస్ట్ స్పెషల్ ఈవెంట్