డెయిలీ డిస్కౌంట్లు : PUBG మొబైల్ గేమ్ కొత్త ప్లాన్లు ఇవే

పబ్ జీ మొబైల్ వీడియో గేమ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ల వరకు అందరూ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు..

  • Published By: sreehari ,Published On : April 2, 2019 / 05:30 AM IST
డెయిలీ డిస్కౌంట్లు : PUBG మొబైల్ గేమ్ కొత్త ప్లాన్లు ఇవే

పబ్ జీ మొబైల్ వీడియో గేమ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ల వరకు అందరూ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు..

పబ్ జీ మొబైల్ వీడియో గేమ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ల వరకు అందరూ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. పబ్ జీ గేమ్ ఇన్ స్టాల్ చేసుకోవడం గంటలతరబడి ఆడటం.. ఇదే పని.. చదువుకునే పిల్లలు చదవడం మానేసి పబ్ జీ ఆడేస్తున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా పబ్ జీ తో గడిపేస్తున్నారు. పబ్ జీ గేమ్ లవర్స్ కోసం కొత్త సబ్ స్ర్కిప్షన్ ప్లాన్స్ వచ్చేశాయి. అవే.. ప్రైమ్, ప్రైమ్ ప్లస్. పబ్ జీ ప్లేయర్ల అందరికి అందుబాటులో ఉన్న ఈ ప్లాన్స్ పై కొన్ని దేశాల్లో ఇటీవల పరిమితులు విధించారు. ప్రైమ్, ప్రైమ్ ప్లస్ ప్లాన్స్ ద్వారా పబ్ జీ యూజర్లు డెయిలీ బోనస్ అన్ నౌన్ క్యాష్ (UC) డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ బోనస్ డిస్కౌంట్ల ద్వారా బాటిల్ పాయింట్స్ (BP)తో పబ్ జీ ఐటమ్స్ కొనుగోలు చేయొచ్చు.

పబ్ జీ మొబైల్ గేమ్ ప్రైమ్, ప్రైమ్ ప్లస్ సబ్ స్రిప్షన్లు రెండూ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ యాక్సస్ చేసుకోవాలంటే.. పబ్ జీ ప్లేయర్లు.. నెలకు రూ.85, రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి నెల తర్వాత ప్రైమ్ ప్లస్ ప్లాన్ కు నెలకు రూ.850 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక ఐఫోన్ iOS డివైజ్ ల్లో కూడా ప్రైమ్, ప్రైమ్ ప్లస్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ సబ్ స్రిప్షన్ రూ.79, ప్రైమ్ ప్లస్ రూ.419 నెలకు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి నెల తర్వాత ఐఓఎస్ డివైజ్ ల్లో ప్రైమ్ ప్లస్ రూ.799 నుంచి అందుబాటులో ఉంటుంది. 

ఈ రెండు ప్లాన్లతో పబ్ జీ యూజర్లు రోజూ బోనస్ పాయింట్లు గెలుచుకుని వాటితో గేమ్ ఐటమ్స్ కొనుగొలు చేసుకోవచ్చు. ప్రైమ్ ప్లస్ ప్లాన్ యాక్సస్ చేసుకుంటే.. ఐటమ్స్ పై ఆఫర్లు, డిస్కౌంట్లు వర్తిస్తాయి. BP పాయింట్స్ తో పబ్ జీ ప్రైమ్ ప్లస్ యూజర్లకు మరిన్ని ఐటమ్స్ కొనుగొలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ పాయింట్స్ అన్ని క్లాసిక్ క్రేట్ లాటరీపై డిస్కౌంట్ పొందవచ్చు.

ఇటీవల పబ్ జీ మొబైల్ గేమ్ కంపెనీ.. సబ్ స్రిప్షన్ మోడల్ ప్లాన్స్ ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. అప్పుడే పబ్ జీ మొబైల్ అప్ డేట్ 0.11.5ను రిలీజ్ చేయగా.. అది వర్కింగ్ లోనే ఉంది. ఇలోగా 0.12.0 బీటా వెర్షన్ పై కూడా టెస్టింగ్ మొదలైంది. త్వరలో పబ్ జీ కొత్త మోడ్ డార్కెస్ట్ నైట్ 0.12.0 ను ఆవిష్కరించనుంది. ఈ కొత్త అప్ డేట్ లో పబ్ జీ గేమ్ యూజర్ల కోసం లిక్విడ్ నైట్రోజన్ గ్రెనేడ్స్, జంపింగ్ జాంబీస్, జాంబీ డాగ్స్, న్యూ మెనూ సెక్షన్ (మ్యూజెన్ స్పెస్/ఇన్ఫినిటీ)ను రిలీజ్ చేయనుంది.