డిసెంబర్ నుంచే మొబైల్ కాల్ ఛార్జీలకు రెక్కలు

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 08:47 AM IST
డిసెంబర్ నుంచే మొబైల్ కాల్ ఛార్జీలకు రెక్కలు

మొబైల్‌ కాల్‌ చార్జీలకు రెక్కలు రానున్నాయి. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక టారిఫ్ పెంపు అనివార్యమని టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయి. వచ్చే నెల నుంచి టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్ టెల్, రిలయెన్స్, జియో, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్‌లు రెడీ అయిపోయాయి.

ఇక టారిఫ్‌లపై ఇక ఎలాంటి చర్చలు ఉండవని, మున్ముందు కూడా ఛార్జీలు పెరుగుతాయని టెలికాం వర్గాలు స్పష్టం చేశాయి. టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపులో తాము జోక్యం చేసుకోమని ఓ అధికారి తెలిపారు. కాల్ ఛార్జీలు అమల్లోకి వచ్చాక..యూజర్ నుంచి వచ్చే రెస్పాండ్ ఎలా ఉంటుందో వేచి చూస్తామని, ఏఆర్‌పీయూలు తగిన స్ధాయిలో ఉంటే ఫ్లోర్‌ ప్రైసింగ్‌ అవసరం లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ చెప్పారు. 

టారీఫ్‌ల పెంపునకు జియో కూడా సంకేతాలు పంపినా ఇతర టెలికాం కంపెనీలు పెంచిన స్థాయిలో ఛార్జీల పెంపు ఉండదని భావిస్తున్నారు. టారిఫ్‌లు పెంచకుంటే..తాము పెద్ద సంఖ్యలో సబ్ స్రైబర్లను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. 
Read More : Airtel, Jio ఆఫర్లు.. queue up రీఛార్జ్ ప్లాన్లు ఇవే