Apple Payments India : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇండియాలో ఆపిల్ పేమెంట్లకు బ్రేక్..!
Apple Payments India : భారత్‌లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ కారణంగా ఆపిల్ తమ యాప్‌పై కార్డుల పేమెంట్లను నిలిపివేసింది.

Apple Payments India : భారత్‌లో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ కారణంగా ఆపిల్ తమ యాప్‌పై కార్డుల పేమెంట్లను నిలిపివేసింది. యాప్ స్టోర్‌లో సబ్స్క్రిప్షన్లు, యాప్ పేమెంట్ల కోసం కార్డ్ పేమెంట్లను ఆమోదించడాన్ని Apple నిలిపివేసింది. యాప్ స్టోర్‌లో సర్వీసులు లేదా కొనుగోళ్లకు పేమెంట్లు చేయడానికి భారత యూజర్లు ఇకపై తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించలేరు. ఆటో-డెబిట్ పేమెంట్లపై గత ఏడాదిలో ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసందే.
దీని కారణంగానే ఆపిల్ స్టోర్లలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేయడం కుదరదు. కాకపోతే.. నెట్ బ్యాంకింగ్, UPI లేదా Apple ID బ్యాలెన్స్ ద్వారా పేమెంట్లు చేసి ఏదైనా కొనుగోళ్లు చేయవచ్చు. ఈ సర్వీసుల కోసం సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చని Apple సపోర్టులో పేజీ పేర్కొంది. ఇప్పటికే మీ Apple ID అకౌంట్లో మీ కార్డ్ వివరాలను యాడ్ చేసి ఉన్నట్టుయితే.. కొత్త మార్గదర్శకాల కారణంగా ఆటో-డెబిట్ పేమెంట్ విధానాన్ని కొనసాగించలేరు. ఒకవేళ ప్రయత్నిస్తే.. ఈ కార్డ్ టైప్ ఇకపై సపోర్టు లేదు అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. భారత్‌లో రెగ్యులేటరీ అవసరాలు పునరావృత లావాదేవీల ప్రాసెసింగ్‌కు వర్తిస్తాయి.
భారతీయ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఆపిల్ స్టోర్‌లో సబ్ స్ర్కిప్షన్ కలిగి ఉంటే.. ఈ కొత్త మార్పులు మీ లావాదేవీలపై ప్రభావం చూపుతాయి. ఇందులో కొన్ని లావాదేవీలను బ్యాంకులు కూడా తిరస్కరించే అవకాశం ఉంది. మీ సబ్ స్ర్కిప్షన్ ద్వారా మీ Apple ID బ్యాలెన్స్‌తో పేమెంట్లు చేసుకోవచ్చు. మీరు యాప్ స్టోర్ కోడ్లు, నెట్ బ్యాంకింగ్, UPIని ఉపయోగించి మీ Apple ID బ్యాలెన్స్ యాడ్ చేసుకోవచ్చు సపోర్ట్ పేజీలో ఉంది. RBI గత ఏడాదిలోనే ఆటో-డెబిట్ పేమెంట్ మార్గదర్శకాలను ప్రకటించిందనే విషయాన్ని ఇందులో పొందుపరిచింది.

Rbi Rules Break Apple Payments In India, Apple Stops Taking Credit And Debit Card Payments
ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ చేసేందుకు 24 గంటల ముందు బ్యాంకులు ప్రీ-డెబిట్ నోటిఫికేషన్‌ను పంపాల్సి ఉంటుంది. ప్రతి నెలా ప్రతి లావాదేవీకి ఇది అవసరమే.. రూ. 5వేల కన్నా ఎక్కువగా పేమెంట్లు చేసేవారికి ముందుగా OTPతో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. చాలా బ్యాంకులు, ఆన్లైన్ సర్వీసులు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యాయి. వినియోగదారులపైనే కాకుండా వ్యాపారాలపై కూడా ప్రభావం చూపింది. భారత్‌లో ఆపిల్ యూజర్లకు పేమెంట్లు చేయడానికి ఏకైక మార్గం Apple ID అకౌంట్లో బ్యాలెన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆపిల్ యూజర్లు నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు.
మీ Apple IDకి బ్యాల్సెన్స్ ఎలా జోడించాలంటే?
మీ Apple IDకి బ్యాల్సెన్స్ యాడ్ చేయడం చాలా సులభం. మీరు చేయాల్సిందిల్లా..
– మీ iPhone, iPad లేదా Macలో Apple యాప్ స్టోర్‌కి వెళ్లండి.
– స్క్రీన్ టాప్ రైట్ కార్నర్లో ఉన్న మీ ప్రొఫైల్ పిక్ నొక్కండి.
– అకౌంట్లో Add Money ఆప్షన్ నొక్కండి. మీరు మీ అకౌంట్ ఎంత మొత్తాన్ని యాడ్ చేస్తారో ఎంచుకోవచ్చు.
– మీ పేమెంట్ వివరాలను ధృవీకరించడానికి ఆన్-స్క్రీన్ సూచనలపై నొక్కండి..
– యాప్ కొనుగోలు లేదా సబ్స్క్రిప్షన్ రెన్యువల్ గడువుపై ఆటోమేటిక్‌గా ఆప్షన్ రిమూవ్ చేసుకోవాలి.
– ఎప్పటికప్పుడూ బ్యాలెన్స్ ఖాళీ అయితే.. వెంటనే ఆ మొత్తాన్ని అకౌంట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి.
1AP Politics : ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? : బుద్దా వెంకన్న
2Aadhi Pinisetty-Nikki Galrani : ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని పెళ్లి వేడుకలు
3Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
4Madhya pradesh : రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి అడుగిడిన బంగారం వ్యాపారి
5Coronavirus: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా..
6Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
7AP politics : తాడేపల్లిలో గన్నవరం పంచాయితీ..వల్లభనేని వంశీ..దుట్టా రామచంద్రరావులను పిలిపించిన సీఎం జగన్
8Cannes 2022 : సినీ ప్రపంచం అండగా నిలవాలి.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రసంగం
9CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
10Telangana News: నేడు క్యాబ్, ఆటోలు బంద్.. గ్రేటర్లో ఆర్టీసీ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
-
Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
-
Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
-
YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్