Realme C33 Launch : రూ.10వేల లోపు బడ్జెట్‌లో రియల్‌మి C సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

Realme C33 Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి భారత మార్కెట్లో కొత్త C సిరీస్ స్మార్ట్ ఫోన్ (Realme C33 Launch) లాంచ్ అయింది. రూ.10వేల కన్నా తక్కువ ధరలో బడ్జెట్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ డివైజ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Realme C33 Launch : రూ.10వేల లోపు బడ్జెట్‌లో రియల్‌మి C సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

Realme C33 launched in India_ Price, top features, design and everything else you need to know

Realme C33 Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి భారత మార్కెట్లో కొత్త C సిరీస్ స్మార్ట్ ఫోన్ (Realme C33 Launch) లాంచ్ అయింది. రూ.10వేల కన్నా తక్కువ ధరలో బడ్జెట్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ డివైజ్ బెస్ట్ అని చెప్పవచ్చు. Realme C33 స్మార్ట్ ఫోన్ ధర రూ. 8,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఆసక్తిగల వినియోగదారులు రియల్‌మి C33 ఫ్లిప్‌కార్ట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. హుడ్ కింద ఎంట్రీ-లెవల్ చిప్‌తో వచ్చింది. కానీ, ఒక పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీని కూడా పొందవచ్చు. Realme C33తో కంపెనీ తక్కువ ధరల విభాగంలో డిజైన్ అప్‌గ్రేడ్‌ను అందించలేదు. కానీ, కొత్త ‘బౌండ్‌లెస్ C డిజైన్’ ని అందించింది. కొత్త Realme C33 4G స్మార్ట్‌‌ఫోన్ ఫీచర్లు, ధర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Realme C33 launched in India_ Price, top features, design and everything else you need to know

Realme C33 launched in India_ Price, top features, design

Realme C33 : స్పెసిఫికేషన్‌లు ఇవే :

– Display : 400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది.
– Processor : యునిసోక్ T612 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.
– RAM : 3GB, 4GB RAM ఆప్షన్లతో అందిస్తుంది.
– Storage : Realme C33 32GB, 64GB స్టోరేజ్ మోడల్‌లలో అందుబాటులో ఉంది.
– Software : డివైజ్ ఆండ్రాయిడ్ 12OSతో రన్ అవుతుంది.
– Camera : వెనుకవైపు 50-MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు 5-MP సెన్సార్
– Battery : హుడ్ కింద 5,000mAh బ్యాటరీ ఉంది.

Realme C33 : టాప్ ఫీచర్లు ఇవే :

Realme C33 స్మార్ట్‌ఫోన్ కొత్త బౌండ్‌లెస్ సీ డిజైన్‌ కలిగి ఉంది. దీని వెనుక ప్యానెల్ సాండ్ షేప్ కలిగి ఉంది. ఇతర పోటీదారుల కన్నా మరింత ఆకర్షణీయంగా Realme ముందు భాగం చాలా ఫోన్‌లను పోలి ఉంటుంది. కొత్త Realme C33లో పవర్ ఫుల్ చిప్‌సెట్ లేదు. బడ్జెట్ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ యూనిట్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ ఇంటర్నల్ స్టోరేజీ (1TB వరకు) పెంచుకునేందుకు Realme ఆప్షన్ కూడా ఇచ్చింది. ఫోటోగ్రఫీ కోసం.. 50-MP ప్రైమరీ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Realme C33 launched in India_ Price, top features, design and everything else you need to know

Realme C33 launched in India_ Price, top features, design

ఈ సెన్సార్ అందమైన షాట్‌లతో పాటు తక్కువ-కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను అందిస్తుందని Realme తెలిపింది. కెమెరా యాప్ పోర్ట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్, ఎక్స్‌పర్ట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. 30fps వద్ద గరిష్టంగా 1080p వీడియోలను రికార్డ్ చేయవచ్చు. హ్యాండ్‌సెట్ భారీ 6.5-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. కొత్త ఫోన్ అల్ట్రా-స్లిమ్ బాడీతో ఐఫోన్‌ల మాదిరిగానే రియల్‌మి C33 బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉండనుంది. ఫోన్ అంచులు కొద్దిగా కర్వడ్ షేప్‌తో పట్టుకునేందుకు మంచి గ్రిప్ కూడా ఉంటుంది.

Realme C33 : ధర ఎంతంటే? :

భారత మార్కెట్లో Reame C33 ధర 3GB RAM + 32GB స్టోరేజ్ మోడల్ రూ. 8,999 నుంచి ప్రారంభమవుతుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999కు అందుబాటులో ఉంది. ఈ కొత్త Realme ఫోన్ గోల్డ్, ఆక్వా బ్లూ, బ్లాక్ సహా మూడు కలర్ ఆప్షన్లలో సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ 12న సేల్ ప్రారంభం కానుంది.

Read Also : Realme 9i 5G : రియల్‌మి 9i 5G సేల్ మొదలైందోచ్.. మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం.. ధర ఎంతంటే?