Realme GT Neo 3 Thor : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. రియల్‌మి GT నియో 3 థోర్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది.. అదే.. Realme GT Neo 3 అనే కొత్త థోర్ లవ్, థండర్ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది.

Realme GT Neo 3 Thor : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. రియల్‌మి GT నియో 3 థోర్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

Realme Gt Neo 3 Thor Love And Thunder Launched In India With 150w Fast Charging, Dimensity 8100 Soc

Realme GT Neo 3 Thor : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది.. అదే.. Realme GT Neo 3 అనే కొత్త థోర్ లవ్, థండర్ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో మార్వెల్ స్టూడియోస్ మూవీ రిలీజ్ అయిన రోజునే ఈ కొత్త వేరియంట్‌ డివైజ్ లాంచ్ చేశారు. Realme స్పెషల్ నైట్రో బ్లూ కలర్ ఆప్షన్లలో GT నియో 3ని రిలీజ్ చేసింది. GT నియో 3 ప్రత్యేక ఎడిషన్ వేరియంట్ లోపల మల్టీ గూడీస్‌తో స్పెషల్ రిటైల్ ప్యాకేజీతో వస్తుంది. కస్టమ్ థోర్-థీమ్ సిమ్ ఎజెక్టర్ పిన్, స్టిక్కర్ల గ్రూప్ థోర్: లవ్ థండర్-ప్రేరేపిత కార్డ్‌లను కలిగి ఉంది.

Realme Gt Neo 3 Thor Love And Thunder Launched In India With 150w Fast Charging, Dimensity 8100 Soc

Realme Gt Neo 3 Thor Love And Thunder Launched In India With 150w Fast Charging, Dimensity 8100 Soc

Realme GT నియో 3 థోర్ లవ్ థండర్ లిమిటెడ్ ఎడిషన్ ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో ఇండియాకు వస్తోంది. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ.42,999కి అందుబాటులో ఉండనుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు జూలై 13 నుంచి భారత మార్కెట్లో Realme GT Neo 3ని కొనుగోలు చేయవచ్చు. Realme UI 3.0 లేయర్‌తో వచ్చింది. లాంచ్ ఆఫర్లలో భాగంగా.. కస్టమర్‌లు ప్రీపెయిడ్ లావాదేవీలపై రూ. 3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. డివైజ్.. స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే అదే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను అందిస్తోంది.

12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో MediaTek డైమెన్సిటీ 8100 SoCని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ లేదు. హుడ్ కింద.. 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 mAh బ్యాటరీ ఉంది. 17 నిమిషాల్లో ఫోన్ 1 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని Realme పేర్కొంది. GT Neo 3 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. వెనుకవైపు, 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఈ డివైజ్ 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీల కోసం.. నియో 3లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైజ్.. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో రన్ అవుతుంది.

Read Also : Apple Lockdown Mode : ఐఫోన్‌లో కొత్తగా ‘లాక్‌డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!