Realme GT Neo 5 Phone : జనవరి 5న రియల్‌మి GT Neo 5 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme GT Neo 5 Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) వచ్చే 2023 జనవరిలో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. అందులో Realme GT Neo 5 జనవరి 5న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

Realme GT Neo 5 Phone : జనవరి 5న రియల్‌మి GT Neo 5 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme GT Neo 5 confirmed to launch on January 5, tipped to support 240W charging

Realme GT Neo 5 Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) వచ్చే 2023 జనవరిలో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. అందులో Realme GT Neo 5 జనవరి 5న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదివరకే షావోమీ (Xiaomi) భారత మార్కెట్లో Redmi Note 12 సిరీస్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోంది. Realme ఫోన్ మరో దేశంలో లాంచ్ అవుతోంది. లేటెస్ట్ Realme GT నియో స్మార్ట్‌ఫోన్ భారత్‌కు కూడా వచ్చే అవకాశం ఉంది. రాబోయే Realme 5G ఫోన్ ఫీచర్లకు సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మి GT Neo 4 కన్నా ముందే లాంచ్? :
ఈ ఏడాది ప్రారంభంలో, కంపెనీ Realme GT నియో 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. GT నియో 4 మోడల్ త్వరలో లాంచ్ అవుతుందని పుకార్లు వచ్చాయి. కానీ, కంపెనీ GT నియో 5 వేరియంట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. GT నియో 4 లాంచ్ కాకముందే నేరుగా Realme GT Neo 5 అని లాంచ్ చేయనున్నట్టు సూచిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతానికి తెలియదు. లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ దీనిపై వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Realme GT Neo 5 confirmed to launch on January 5, tipped to support 240W charging

Realme GT Neo 5 confirmed to launch on January 5, tipped to support

Read Also :  Realme GT Neo 4 : రియల్‌మి GT నియో 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

రియల్‌మి GT Neo 5 ఫీచర్లు (అంచనా) :
రాబోయే ప్రీమియం 5G ఫోన్ ఫీచర్లను రివీల్ చేయలేదు. Realme GT Neo 5 ప్రీమియం ఫోన్ నుంచి ఎలాంటి ఫీచర్లు ఉండొచ్చు అనేది కొన్ని వివరాలను అందించాయి. హుడ్ కింద ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ వేగవంతమైన పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని అందిస్తుంది. 144Hz వద్ద రిఫ్రెష్ చేసే 6.7-అంగుళాల 1.5K OLED స్క్రీన్‌ని చూడవచ్చు. ఈ డివైజ్‌తో కంపెనీ 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టును అందిస్తుంది. Realme GT Neo 3తో అందించిన 150W ఫాస్ట్ ఛార్జింగ్ కన్నా పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. బ్యాటరీతో పాటు ఛార్జింగ్ పరంగా కంపెనీ రెండు మోడళ్లను ప్రకటించే అవకాశం ఉంది.

Realme GT Neo 5 confirmed to launch on January 5, tipped to support 240W charging

Realme GT Neo 5 confirmed to launch on January 5

లీక్‌లను పరిశీలిస్తే.. మోడల్ 150W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండవ వేరియంట్ 4,600mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. 240W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుందని చెప్పవచ్చు. ఫోటోగ్రఫీ కోసం.. వెనుక కెమెరా సెటప్‌లో f/1.79 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50-MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా ఉంటుంది. మిగిలిన సెన్సార్ల వివరాలు ఇంకా తెలియరాలేదు. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు స్టీరియో స్పీకర్‌లను ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఆసక్తికరంగా, RGB లైటింగ్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.

Realme GT Neo 5 భారత్‌కు వస్తుందా?
రియల్‌మి GT నియో 5 భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ, స్మార్ట్‌ఫోన్ ఈ మార్కెట్‌కి వస్తుందని భావించవచ్చు. Realme భారత్ కీలకమైన మార్కెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. కంపెనీ అన్ని Realme GT సిరీస్ ఫోన్‌లను భారతీయ మార్కెట్లో కూడా లాంచ్ చేసింది. భారత మార్కెట్‌లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. Realme GT Neo 3 దేశంలో రూ. 36,999కి అందుబాటులోకి వచ్చింది. కొత్తది ఇదే ధర పరిధిలో ఉండే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 5G Launch in India : రియల్‌మి 10 సిరీస్ 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?