Realme GT Neo 5 SE Launch : 5,500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి GT Neo 5 SE ఫోన్.. లాంచ్ డేట్ తెలిసిందోచ్..!

Realme GT Neo 5 SE : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటు 5,500mAh బ్యాటరీతో రియల్‌మి GT Neo 5 ఫోన్ లాంచ్ చేయనున్నట్టు రియల్‌మి ధృవీకరించింది.

Realme GT Neo 5 SE Launch : 5,500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి GT Neo 5 SE ఫోన్.. లాంచ్ డేట్ తెలిసిందోచ్..!

Realme GT Neo 5 SE Confirmed to Get 5,500mAh Battery, 100W Fast Charging; Launch Set for April 3_ Details

Realme GT Neo 5 SE Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటు 5,500mAh బ్యాటరీతో (Realme GT Neo 5 SE)ని లాంచ్ చేయనున్నట్టు రియల్‌మి ధృవీకరించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 3న చైనాలో లాంచ్ కానుంది.

లాంచ్‌కు ఒక వారం కన్నా తక్కువ సమయం ఉంది. ఇంతలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇప్పటికే అధికారిక (Weibo) పేజీలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7+ Gen 2 SoC ద్వారా అందించనుంది. గరిష్టంగా 1TB స్టోరేజీని అందిస్తుంది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5 k రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉందని ధృవీకరించింది.

Read Also :  Google Chrome Feature : డెస్క్‌టాప్‌ యూజర్లకు పండగే.. గూగుల్ క్రోమ్‌‌లో సరికొత్త ఫీచర్లు.. ఇక మీ బ్రౌజర్‌ సూపర్ ఫాస్ట్‌..!

రియల్‌మి పోస్టర్ ప్రకారం.. రియల్‌మి (GT Neo 5 SE) 100W వైర్డు ఛార్జింగ్, 5,500mAh బ్యాటరీ కెపాసిటీకి సపోర్టుతో రానుంది. రియల్‌మి నుంచి రాబోయే ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5 రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ధృవీకరించింది. అదనంగా, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 SoC ద్వారా అందించనుందని పేర్కొంది. హ్యాండ్‌సెట్‌లో 16GB RAM, 1TB స్టోరేజ్ వరకు అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8.95 మిమీ మందంతో పాటు 193.1 గ్రా బరువు ఉంటుంది.

Realme GT Neo 5 SE Confirmed to Get 5,500mAh Battery, 100W Fast Charging; Launch Set for April 3_ Details

Realme GT Neo 5 SE Confirmed to Get 5,500mAh Battery, 100W Fast Charging

రియల్‌మి హ్యాండ్‌సెట్ GT Neo 5 SE ఫోన్ 1,240 x 2,772 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 2,160Hz PWM డిమ్మింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని గతంలో నివేదిక సూచించింది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. f/1.79 ఎపర్చర్‌తో కూడిన 64-MP ఓమ్నివిజన్ ప్రైమరీ రియర్ కెమెరా, 8-MP సోనీ IMX355 అల్ట్రా-వైడ్ సెన్సార్, 2-MP సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించనుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-MP ఫ్రంట్ కెమెరా కూడా ఫోన్‌లో ఉంటుందని అంచనా. గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్‌లోని ఫోన్ లిస్టు ప్రకారం.. 8GB మెమరీని కలిగి ఉంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుందని వెల్లడించింది. ఈ జాబితాలో 2.92 GHz వద్ద క్లాక్ చేసిన ప్రైమరీ కోర్‌తో Realme GT నియో 5 SE చిప్‌సెట్‌ను రివీల్ చేసింది. ఇందులో మూడు సెకండరీ కోర్లలో 2.50 GHz, నాలుగు పవర్-సేవింగ్ కోర్ 1.80 GHz వద్ద ఉన్నాయి.

Read Also : Honda New Two Wheelers : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? దీపావళికి ముందే హోండా నుంచి 3 కొత్త టూ-వీలర్లు.. ఏ మోడల్ ఎలా ఉండొచ్చుంటే?