Realme నుంచి రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

  • Published By: sreehari ,Published On : August 18, 2020 / 07:49 PM IST
Realme నుంచి రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మంగళవారం రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రియల్ మి నుంచి C12 , C15 పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ఫోన్లలో భారీగా 6000mAh బ్యాటరీతో వచ్చింది. రియల్‌మి C15 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3GB+ 32GB ధర రూ. 9,999, 4GB + 64GB ధర రూ .10,999కే లభ్యమవుతోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 27న సేల్ ప్రారంభం కానుంది.



రియల్‌మి C12 ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. 3GB+32GB ధర రూ. 8,999కే లభ్యం కానుంది. ఈ డివైజ్ ఆగస్టు 24 న అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రీ లెవల్ విభాగంలో మల్టీ ఆప్షన్లతో C సిరీస్‌ ఫోన్లను లక్ష్యంగా ప్రవేశపెట్టామని రియల్‌మే ఇండియా వైస్ ప్రెసిడెంట్, రియల్‌మే ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవ్ శేత్ అన్నారు.

రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 6.5-అంగుళాల HD+ మినీ-డ్రాప్ పూర్తి-స్క్రీన్ డిస్ ప్లే 20:9 రేషియో నిష్పత్తితో ఉంటుంది. లార్జ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్క్రీన్‌పై మినీ డ్రాప్ సాధారణ డ్యూడ్రాప్ కంటే 30.9 శాతం చిన్నదిగా ఉంటుంది.. స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతం ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది.



రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు రెండూ ప్రత్యేకమైన గ్రేడియంట్ ఎండ్ కలిగి ఉంటాయి.. మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 10, కలర్‌ఓఎస్ 7 ఆధారంగా, రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇన్ స్టంట్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. ఫేస్ రికగ్నైజేషన్ సపోర్ట్ ఇస్తాయి.

రియల్‌మే C15 క్వాడ్ కెమెరాతో మొదటి C-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తోంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP B&W లెన్స్, 2MP రెట్రో లెన్స్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా క్రిస్టల్ క్లియర్ సెల్ఫీలు తీసుకోవచ్చు.. AI బ్యూటిఫికేషన్ ఫంక్షన్, HDR మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, Panoselfie ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది.

C12లో 13MP AI ట్రిపుల్ కెమెరా ఉంది. క్రోమా బూస్ట్, పోర్ట్రెయిట్ మోడ్, స్లో-మోషన్ వీడియో రికార్డింగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రధాన కెమెరాతో పాటు 2MP B&W లెన్స్ 2MP మాక్రో లెన్స్‌తో పాటు పోర్ట్రెయిట్‌ల కోసం ప్రత్యేక ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.



స్మార్ట్ ఫోన్ యూజర్లు సెల్ఫీలను తీయడానికి ‘Panoselfie’ ఫీచర్ అందిస్తుంది. రియల్‌మి C15 18W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను 6000mAhలో 0 శాతం 25 శాతం నుంచి 30 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు.. C12 బాక్స్‌లో 10W ఛార్జర్‌తో వస్తుంది. కంపెనీ రియల్‌మే బడ్స్ క్లాసిక్‌ను రూ .399 కు ప్రకటించింది. బడ్స్ క్లాసిక్ బ్లాక్, వైట్ రెండు క్లాసిక్ రంగులలో లభిస్తుంది.