Realme First-ever Tablet : రియల్‌మి నుంచి ల్యాప్‌టాప్‌, ఫస్ట్ ట్యాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ తయారీ దిగ్గజం రియల్‌మి నుంచి మొట్టమొదటి ట్యాబ్లెట్ వస్తోంది.. జూన్ 15న రియల్ మి ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో రియల్‌మి కొత్త ల్యాప్ టాప్‌తో పాటు కంపెనీ ఫస్ట్ ట్యాబ్లెట్‌ ను ఆవిష్కరించనుంది.

10TV Telugu News

Realme First-ever Tablet : ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ తయారీ దిగ్గజం రియల్‌మి నుంచి మొట్టమొదటి ట్యాబ్లెట్ వస్తోంది.. జూన్ 15న రియల్ మి ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో రియల్‌మి కొత్త ల్యాప్ టాప్‌తో పాటు కంపెనీ ఫస్ట్ ట్యాబ్లెట్‌ ను ఆవిష్కరించనుంది. ప్రపంచవ్యాప్తంగా రియల్‌మి GT 5G ఫ్లాగ్ షిప్ డివైజ్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మార్కెట్లో దూసుకుపోతున్న రియల్ మి బ్రాండ్.. ఇతర ట్యాబ్లెట్, ల్యాప్ వంటి కేటగిరీలపై కూడా ఫోకస్ పెడుతోంది.

ఇటీవలే రియల్ మి ఇండియా సీఈఓ మాదవ్ సేథ్.. రియల్ మి ల్యాప్ కు సంబంధించి ట్వీట్ చేశారు. రియల్ మి కంపెనీ నుంచి కొత్త రియల్ మి బుక్ అనే ల్యాప్ టాప్ రాబోతుందనే హింట్ ఇచ్చారు. మ్యాక్ బుక్ ఎయిర్ మాదిరిగా రియల్ మి బుక్ కనిపిస్తోంది. సిల్వర్ కలర్, అల్యూమినియం బాడీ డిజైన్ కలిగి ఉంది. ఇందులో ఎలాంటి మెటేరియల్ రియల్ మి వాడిందో స్పష్టత లేదు.

లీకైన ల్యాప్ టాప్ ఫొటోలో మాత్రం Realme Book డిజైన్ కుడి, ఎడమ, సెంటర్ మాత్రమే కనిపించేలా ఉంది. ల్యాప్ టాప్ స్పెషిఫికేషన్లు ఏంటో తెలియాల్సి ఉంది. అలాగే రియల్ మి ట్యాబ్లెట్ Realme Pad పేరుతో లాంచ్ కానుంది. ఆపిల్ ఐప్యాడ్ మాదిరిగా గ్రాండ్ లుక్, డిజైన్, హైఎండ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఏయే ఫీచర్లు, స్పెషిషికేషన్లు ఉన్నాయో తెలియాలంటే.. రియల్ మి స్పెషల్ లాంచ్ ఈవెంట్ వరకు వేచిచూడాల్సిందే.