Redmi K50i 5G : ఇండియాలో రెడ్‌మి K సిరీస్ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు రెడ్‌‌మి నుంచి అనేక సిరీస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో ఇదే నెలలో రెడ్‌మి Redmi K50i 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.

Redmi K50i 5G : ఇండియాలో రెడ్‌మి K సిరీస్ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Redmi K50i 5g Is Coming To India This Month, Gets A Launch Date (1)

Redmi K50i 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు రెడ్‌‌మి నుంచి అనేక సిరీస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. Xiaomi సబ్-బ్రాండ్ రెడ్‌మి నుంచి K సిరీస్‌లో 5G ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో ఇదే నెలలో రెడ్‌మి Redmi K50i 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ రెడ్‌మి భారత్‌లో Redmi K50i 5Gని లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించింది. జూలై 20న Redmi K50i 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు Redmi కంపెనీ ట్విట్టర్‌లో వెల్లడించింది. Redmi అధికారికంగా లాంచ్ తేదీని వెల్లడించలేదు.

Redmi K50i 5G గతంలో చైనాలో లాంచ్ అయిన Redmi 11TPro+ రీబ్రాండెడ్ వెర్షన్ గా మార్కెట్ విశ్లేషుకుల అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ 6GBతో సహా రెండు RAM వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. 8GB RAM. Redmi Redmi 11T Pro, Redmi 11T Pro+లను లాంచ్ చేసింది. ప్రధానంగా ఒకే డివైజ్..రెండు డివైజ్‌ల మధ్య ఉన్న తేడా ఏంటంటే.. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు చేయడమే.. రాబోయే K సిరీస్ గురించి పెద్దగా తెలియదు. కానీ, Redmi 11T Pro+ రీబ్రాండెడ్ వెర్షన్ అని అంటున్నారు. Redmi K50i 5G ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..

Redmi K50i 5g Is Coming To India This Month, Gets A Launch Date

Redmi K50i 5g Is Coming To India This Month, Gets A Launch Date

రెడ్‌మి K50i 5G : ధర (అంచనా) :
Redmi K50i 5G రీబ్రాండెడ్ Redmi 11T Pro+ చెప్పవచ్చు. ఈ ఫోన్ ధర ఉండవచ్చు. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,260). Redmi Note 11Tpro CNY 1,799లకు లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర దాదాపు రూ. 20,930గా ఉండనుంది. Redmi K50i 5G భారత మార్కెట్లో రూ. 25,000 లోపు ధర ఉండవచ్చు.

రెడ్‌మి K50i 5G స్పెసిఫికేషన్స్ :
Redmi K50i 5G, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.6-అంగుళాల Full HD+ IPS డిస్‌ప్లేతో రానుంది. 650 నిట్‌ల వరకు బ్రైట్ అందించగలదు. Redmi K50I 5G ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 8GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. కెమెరా విభాగంలో Redmi K50i 5G ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. 64-MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8-MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-MP మాక్రో సెన్సార్ కూడా ఉండవచ్చు. 67 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5080mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Redmi Note 11 SE : భారీ బ్యాటరీతో రెడ్‌మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?