Redmi Note 10S : 8GB RAMతో భారత్‌కు రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే?

షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ Redmi India నుంచి భారత మార్కెట్లలోకి (Redmi Note 10S) స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8GB RAM పవర్‌ఫుల్ స్టోరేజీతో తీసుకొచ్చింది.

Redmi Note 10S : 8GB RAMతో భారత్‌కు రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే?

Redmi Note 10s With 8gb Ram Launched In India At Rs 17,499

Redmi Note 10S : ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ Redmi India నుంచి భారత మార్కెట్లలోకి (Redmi Note 10S) స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌ 8GB RAM పవర్‌ఫుల్ స్టోరేజీతో తీసుకొచ్చింది. డిసెంబర్ 3 (శుక్రవారం) నుంచి దేశంలో మొదటి ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రెడ్ మి ఇండియా ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి కొత్త రెడ్‌మి నోట్ 10S స్మార్ట్ ఫోన్‌లో 8GB RAM, 128GB స్టోరేజీ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. మిగిలిన ఫీచర్లు మాత్రం గత స్మార్ట్ ఫోన్లలో మాదిరిగానే ఉన్నాయి. ఈ ఫోన్ వేరియంట్ ధర రూ.17,499గా కంపెనీ నిర్ణయించింది.

ఇతర స్మార్ట్ ఫోన్ల (6GB RAM, 128GB) మోడల్ డివైజ్ లతో పోలిస్తే.. రూ. 1000కు పైగా ధర అధికంగా ఉంటుంది. 6GB RAM, 64GB స్టోరేజీ ఆప్షన్ ప్రారంభ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్, Mi Homes వెబ్ సైట్లలో Redmi Note 10S స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు లేదా EMI ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ లాంచింగ్‌ ఆఫర్ అందిస్తోంది.

Redmi Note 10S Specifications :
– 6.43 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే (2400×1080) ఫిక్సల్స్ రెజుల్యుషన్, 409 PPI
– MediaTek Helio G95 చిప్‌సెట్, MIUI 12.5 ఆధారిత Android 11
– క్వాడ్ కెమెరా సెటప్, 64MP వైడ్ యాంగిల్ కెమెరా
– 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్
– 13MP సెల్ఫీ షూటర్ (ఫ్రంట్), పంచ్ హోల్ కటౌట్
– 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్
– సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
– AI Face Unlock, Dual Speakers, 3.5mm హెడ్ ఫోన్ జాక్, డ్యుయల్ SIM కనెక్టవిటీ
– IP53 రేటింగ్ (ప్రొటెక్షన్), వాటర్, డస్ట్

Read Also : ATM Cash : న్యూ ఇయర్ నుంచే..పెరగనున్న ఏటీఎం చార్జీలు