ఇండియాలో Redmi Note 9 స్మార్ట్ ఫోన్ లాంచ్..

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 10:29 AM IST
ఇండియాలో Redmi Note 9 స్మార్ట్ ఫోన్ లాంచ్..

భారతదేశంలో రెడ్ మీ 9 ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయిపోయింది. రెడ్ మీ 9 ఫోన్ ను ఇండియాలో 2020, ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాం.వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంచనున్నారు.



వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉండడం విశేషం. 5,020mAh battery ఉంది. ఆండ్రాయిడ్ 10 (MIUI)తో పనిచేయనుంది. 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ (1,080×2,340 pixels) డిస్ ప్లే ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9. G 85 ఆక్టా కోర్ SoC. ఈ ఫోన్ 0.88 సెంటీమీటర్ల మందం ఉంది.



కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ (f/1.79 lens). 8 మెగా పిక్సెల్ f2/2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 2మెగా పిక్సెల్ f2/4 మైక్రో లెన్స్. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లున్నాయి. సెల్ఫీ కోసం ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

1 ) 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది.
2 ) 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499.
3 ) 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999.



22.5W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. 4జీ వోల్టే, వైఫై 802.11a/b/g/n, బ్లూటూత్ v5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. 161.48×76.7×8.75mm and weighs 200 grams.