Redmi Smart Band 2 : రూ. 3,500 ధరకే రెడ్‌మి ఫిట్‌నెస్ స్మార్ట్ బ్యాండ్ 2.. మరెన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు.. ఇప్పుడు కొనేసుకోండి!
Redmi Smart Band 2 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేసింది. ఇప్పటికే Redmi కంపెనీ డిసెంబర్ 2022లో స్మార్ట్ బ్యాండ్ 2ని చైనాలో లాంచ్ చేసింది.

Redmi Smart Band 2 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేసింది. ఇప్పటికే Redmi కంపెనీ డిసెంబర్ 2022లో స్మార్ట్ బ్యాండ్ 2ని చైనాలో లాంచ్ చేసింది. 9.99mm, 1.47-అంగుళాల అల్ట్రా-సన్నని బాడీతో, గత జనరేషన్ స్మార్ట్ బ్యాండ్‌ల కన్నా 76 శాతం పెద్దదిగా ఉంటుంది. గత వెర్షన్లలో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ 2020 వెర్షన్, రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రో 2021 వెర్షన్ ఉన్నాయి. చైనీస్ టెక్ దిగ్గజం ఇప్పుడు జపాన్ మార్కెట్లో ఈ సరికొత్త రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ 2 లాంచ్ చేయగా.. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఫిట్‌నెస్ బ్యాండ్ అవుట్‌డోర్ రన్నింగ్, యోగాతో సహా 30 కన్నా ఎక్కువ కార్యకలాపాల కోసం ట్రాకింగ్ మోడ్‌లను అందిస్తుంది.
Redmi Smart Band 2 ధర ఎంతంటే? :
ఆసక్తిగల కొనుగోలుదారులు Redmi నుంచి ఐవరీ, ఆలివ్, స్నాజీ గ్రీన్, బ్లూ, బ్లాక్, పింక్ అనే 6 అందుబాటులో ఉన్న కలర్ వేరియంట్‌లో సరికొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ఎంచుకోవచ్చు. Redmi బ్యాండ్ 2 42.81mm × 25.42mm × 9.99mm కొలతలతో తేలికపాటి, అతి-సన్నని బాడీని కలిగి ఉంది, బెల్ట్ లేకుండానే ఈ బ్యాండ్ 14.9g బరువు ఉంటుంది. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ 2 మోడల్ జపాన్ మార్కెట్లో JPY 4,999 (దాదాపు రూ. 3,500) నుంచి అందుబాటులో ఉంది. అయితే, ఫిబ్రవరి 6 వరకు ఉన్న ఆఫర్ ప్రకారం.. JPY 4,490 (దాదాపు రూ. 2,800) వద్ద పొందవచ్చు. భారతీయ మార్కెట్‌లో ఫిట్‌నెస్ బ్యాండ్ ఎప్పుడు లాంచ్ అయ్యేది మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Redmi Smart Band 2 With 1.47-Inch TFT Display Launched
రెడ్‌మి Smart Band 2 స్పెసిఫికేషన్లు :
Redmi కొత్త స్మార్ట్ బ్యాండ్ 2 1.47-అంగుళాల (194×368 పిక్సెల్‌లు) ఎప్పుడూ ఆన్‌లో ఉండే TFT టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ 247ppi, 450 nits పీక్ బ్రైట్‌నెస్, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో టెంపర్డ్ గ్లాస్ కవర్ కలిగి ఉంది. ఫిట్‌నెస్ ట్రాకర్ 210mAh బ్యాటరీతో రన్ అవుతుంది. సాధారణ ఉపయోగంలో 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఒకవేళ భారీగా వినియోగిస్తే బ్యాటరీ ఛార్జింగ్ 6 రోజులకు తగ్గిపోతుంది. Redmi స్మార్ట్ బ్యాండ్ 2లో PPG హార్ట్ రేట్ సెన్సార్, SpO2 ట్రాకర్, స్లీప్ ట్రాకర్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్, స్ట్రెస్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ ధృవీకరించింది.
ఈ ట్రాకర్‌లలో ఏ ఫీచర్ కూడా రోగ నిర్ధారణ చేయలేవని కంపెనీ పేర్కొంది. కొనుగోలుదారులు తమ వ్యక్తిగత సూచన కోసం మాత్రమే ఉపయోగించాలి. ఫిట్‌నెస్ ట్రాకర్ బ్లూటూత్ v5.1కి సపోర్ట్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం.. 5ATM (50 మీటర్లు) వరకు వాటర్ ప్రూఫ్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 6.0, అంతకంటే ఎక్కువ లేదా iOS 12, ఆపై వెర్షన్ OS రన్ అవుతున్న స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు చేస్తుంది. కానీ, వినియోగదారులు ఫిట్‌నెస్ బ్యాండ్‌తో Mi ఫిట్‌నెస్ అప్లికేషన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..