యూజర్లకు అలర్ట్ : మీ వాట్సాప్‌కు వల్గర్ మెసేజ్‌లు వస్తున్నాయా?

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మీ వాట్సాప్ కు ఎవరైనా అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారా? బెదిరింపులకు పాల్పడుతున్నారా? కంగారుపడకండి. మీకు అండగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (DoT)ఉంది. మీరు చేయాల్సిందిల్లా..

  • Published By: sreehari ,Published On : February 22, 2019 / 12:17 PM IST
యూజర్లకు అలర్ట్ : మీ వాట్సాప్‌కు  వల్గర్  మెసేజ్‌లు వస్తున్నాయా?

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మీ వాట్సాప్ కు ఎవరైనా అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారా? బెదిరింపులకు పాల్పడుతున్నారా? కంగారుపడకండి. మీకు అండగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (DoT)ఉంది. మీరు చేయాల్సిందిల్లా..

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మీ వాట్సాప్ కు ఎవరైనా అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారా? బెదిరింపులకు పాల్పడుతున్నారా? కంగారుపడకండి. మీకు అండగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (DoT)ఉంది. మీరు చేయాల్సిందిల్లా.. మీ వాట్సాప్ అకౌంట్ కు వచ్చిన వల్గర్ మెసేజ్ లను స్ర్కీన్ షాట్ తీసి DoT (డాట్)కు ఫిర్యాదు చేయడమే.
Read Also: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? : ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

మీకు మెసేజ్ పంపిన వ్యక్తి మొబైల్ నంబర్ తో వల్గర్ మెసేజ్ Screenshot ను ccaddn-dot@nic.in ఈమెయిల్ చేయండి అంటూ డాట్ ఒక ప్రకటనలో వాట్సాప్ యూజర్లకు సూచించింది. మీరు ఫిర్యాదు చేస్తే చాలు.. మిగతంతా డాట్ చూసుకుంటుంది. ‘‘మీకు ఎవరైనా అశ్లీల సందేశాలు, బెదిరింపులు, వల్గర్ మెసేజ్ లు పంపిస్తున్నారా అయితే ఆ మెసేజ్ లను స్ర్కీన్ షాట్ తీయండి. సదరు వ్యక్తి మొబైల్ నెంబర్, మెసేజ్ స్ర్కీన్ షాట్ ను డాట్ మెయిల్ ఐడీకి పంపించండి.

టెలికం ఆపరేటర్లు, పోలీసుల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని డాట్ కంట్రోలర్ కమ్యూనికేషన్ ఆశిష్ జోషి ట్వీట్ చేశారు. ఇప్పటికే జర్నలిస్టులతో కలిపి పలువురు ప్రముఖులకు తమ వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్ లు, బెదిరింపులకు పాల్పడుతూ గుర్తు తెలియని వ్యక్తులు వల్గర్ మెసేజ్ లు పంపిస్తున్నట్టు డాట్ దృష్టికి వచ్చింది. దీనిపై డాట్ ఫిబ్రవరి 19న ఆదేశాలు జారీ చేసింది.
Read Also: శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ వచ్చేసింది : ఇండియాలో ఎంతంటే?

వాట్సాప్ నెట్ వర్క్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అన్నీ టెలికం సర్వీసు ప్రొవైడర్లకు డాట్ సూచించింది. ఇలాంటి మెసేజ్ లు పంపుతున్న తమ కస్టమర్లపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. కస్టమర్ ఆప్లికేషన్ ఫాంలో కస్టమర్ డిక్లరేషన్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.