Reliance Jio 5G Services : దేశవ్యాప్తంగా జియో 5G సర్వీసులు.. కొత్తగా మరో 20 నగరాల్లోకి.. ఇదిగో ఫుల్ లిస్టు.. మీ సిటీ ఉందేమో చెక్ చేసుకోండి!

Reliance Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను విస్తరిస్తూనే ఉంది. అస్సాంలోని బొంగైగావ్, నార్త్ లఖింపూర్, శివసాగర్, టిన్సుకియాలో ఇప్పుడు తమ 5G సర్వీసులను అందుబాటులో తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.

Reliance Jio 5G Services : దేశవ్యాప్తంగా జియో 5G సర్వీసులు.. కొత్తగా మరో 20 నగరాల్లోకి.. ఇదిగో ఫుల్ లిస్టు.. మీ సిటీ ఉందేమో చెక్ చేసుకోండి!

Reliance Jio 5G Services _ Reliance Jio 5G now available in 20 new Indian cities_ Check full list

Reliance Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను విస్తరిస్తూనే ఉంది. అస్సాంలోని బొంగైగావ్, నార్త్ లఖింపూర్, శివసాగర్, టిన్సుకియాలో ఇప్పుడు తమ 5G సర్వీసులను అందుబాటులో తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. బీహార్‌లోని భాగల్‌పూర్ తిహార్, గోవాలోని మోర్ముగావ్, (దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూస్ డయ్యూ, గుజరాత్‌లోని గాంధీధామ్‌లకు కూడా జియో 5G సర్వీసులను అందించనుంది. అంతేకాకుండా, కర్ణాటకలోని రాయచూర్, మధ్యప్రదేశ్‌లోని సత్నా, మహారాష్ట్రలోని చంద్రాజీ, ఇచల్‌పూర్‌లలో జియో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. మణిపూర్ తౌబల్ సహా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్, ఫిరోజాబాద్, ముజఫర్‌నగర్‌లలోని జియో యూజర్లు కూడా 5Gని పొందవచ్చు. జియో కనెక్టివిటీ ఆప్షన్ ద్వారా జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీ, డియోఘర్, హజారీబాగ్‌లలో కూడా అందుబాటులోకి రానుంది.

జియో తన 5G సర్వీసులతో మొత్తం నగరాల సంఖ్యను 277కి తీసుకువెళ్లిందని పేర్కొంది. స్వతంత్ర మౌలిక సదుపాయాలపై ట్రూ 5G సర్వీసులను అందిస్తోంది. ఈ టెక్నాలజీతో Airtel, Vi (Vodafone Idea) వంటి పోటీదారుల కన్నా మెరుగైన ఇంటర్నెట్ స్పీడ్ (1 Gbps వరకు) అందిస్తుంది. దేశంలోని చిన్న పట్టణాలు, నగరాలకు మరింత 5G విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. జియో ట్రూ 5G సర్వీసులను ప్రారంభించడంతో ఈ ప్రాంతంలోని యూజర్లు బెస్ట్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను పొందడమే కాకుండా ఈ-గవర్నెన్స్, విద్య, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో వృద్ధి అవకాశాలను పొందుతారని ప్రతినిధి తెలిపారు.

Reliance Jio 5G Services _ Reliance Jio 5G now available in 20 new Indian cities_ Check full list

Reliance Jio 5G Services _ Reliance Jio 5G now available in 20 new Indian cities

Read Also : Jio 5G Rolling Out : రిలయన్స్ జియో 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G ప్లాన్లు ఉన్నాయంటే? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

ప్రస్తుతం, జియో 5G సర్వీసులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. జియో యూజర్లు 5G-సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారని, MyJio యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినట్టు నిర్ధారించుకోవాలి. Jio 5G యాక్సెస్‌ని పొందడానికి వినియోగదారులు వెల్‌కమ్ ఆఫర్ కోసం సైన్ అప్ చేయాలి. అదనంగా, 5Gని పొందాలంటే యూజర్లు కొత్త SIM కార్డ్ అవసరం లేదు. ఇప్పటికే ఉన్న 4G SIM సరిపోతుందని జియో స్పష్టం చేసింది. Jio వెల్‌కమ్ ఆఫర్‌కు సైన్ అప్ ద్వారా వెంటనే 5Gకి యాక్సెస్ పొందవచ్చు. జియో ప్రీపెయిడ్ యూజర్లు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ ఉన్న ప్లాన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

అయితే, చౌకైన ప్లాన్‌లతో Jio ప్రీపెయిడ్ యూజర్లు అదనపు 5G ప్యాక్‌ని పొందడం ద్వారా 5Gకి కూడా అర్హత పొందవచ్చు. Jio 6GB ఇంటర్నెట్ డేటాను అందించే రూ.615G అప్‌గ్రేడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. జియో యూజర్లు ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ పైన డేటా ప్యాక్‌ అందించాలి. లేకపోతే, ఎయిర్‌టెల్ కనెక్షన్ ఉన్న యూజర్లు ఎంపిక చేసిన నగరాల్లో కూడా 5Gని పొందవచ్చు. జియో మాదిరిగానే, ఎయిర్‌టెల్ యూజర్లను 5Gని ఉచితంగా టెస్టింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ యూజర్లు ఎలాంటి వెల్‌కమ్ ఆఫర్ పొందాల్సిన అవసరం లేదు. జియో సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో 5Gని పొందవచ్చు.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్లు ఇవే.. 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?