Reliance Jio 5G Services : 88 భారతీయ నగరాల్లో జియో 5G సర్వీసులు.. నగరాల పూర్తి జాబితా ఇదే.. మీ ఫోన్‌లో జియో 5G యాక్టివేట్ చేసుకోవాలంటే?

Reliance Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) 2023 ఏడాదిలో ప్రధాన భారతీయ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ని మరింత విస్తరించనుంది. గత ఏడాది అక్టోబర్ 2022లో స్టాండ్-ఎలోన్ 5G నెట్‌వర్క్‌ను జియో ప్రారంభించింది.

Reliance Jio 5G Services : 88 భారతీయ నగరాల్లో జియో 5G సర్వీసులు.. నగరాల పూర్తి జాబితా ఇదే.. మీ ఫోన్‌లో జియో 5G యాక్టివేట్ చేసుకోవాలంటే?

Reliance Jio 5G Services _ Jio 5G launched in 88 Indian cities _ Full list of cities, eligibility, And how to activate

Reliance Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) 2023 ఏడాదిలో ప్రధాన భారతీయ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ని మరింత విస్తరించనుంది. గత ఏడాది అక్టోబర్ 2022లో స్టాండ్-ఎలోన్ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన జియో.. భారత్‌లోని 80కి పైగా నగరాలకు 5G సర్వీసులను అందించింది. మూడు నెలల్లోపు మరిన్ని నగరాల్లో 5G నెట్‌వర్క్ విస్తరించనుంది. ఇటీవలి విస్తరణలో భాగంగా ఆగ్రా, కాన్పూర్ నెల్లూరు, అహ్మద్‌నగర్, మరిన్ని సహా 10 భారతీయ నగరాల్లో జియో తన 5G సర్వీసులను ప్రకటించింది.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలోని మరిన్ని నగరాల్లో 5G సేవలను ప్రకటించింది. జియో ట్రూ 5Gగా పిలిచే కొత్త నెట్‌వర్క్ కనెక్టివిటీ ఇప్పుడు ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, తిరుపతి, నెల్లూరు, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్, అహ్మద్‌నగర్‌లలో అందుబాటులో ఉండనుంది. భారత్‌లోని మెజారిటీ నగరాల్లో 5Gని ప్రారంభించిన మొదటి, ఏకైక ఆపరేటర్‌గా టెల్కో కూడా ప్రకటించింది. Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో లిస్టును ఓసారి పరిశీలిద్దాం..

Read Also :  Reliance Jio Plans : రిలయన్స్ జియో 5G ప్లాన్ల పూర్తి లిస్టు మీకోసం.. 5G డేటా పొందాలంటే ఇలా చేయండి!

Jio 5G నగరాల ఫుల్ లిస్టు :

* అక్టోబర్ 4, 2022 : ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా
* అక్టోబర్ 22, 2022 : నాథద్వారా, చెన్నై
* నవంబర్ 10, 2022 : బెంగళూరు, హైదరాబాద్
* నవంబర్ 11, 2022 : గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్
* నవంబర్ 23, 2022 : పూణే
* నవంబర్ 25, 2022 : గుజరాత్‌లోని 33-జిల్లాలు
* డిసెంబర్ 14, 2022 : ఉజ్జయిని దేవాలయాలు
* డిసెంబర్ 20, 2022 : కొచ్చి, గురువాయూర్ ఆలయం
* డిసెంబర్ 26, 2022 : తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు,
* డిసెంబర్ 28, 2022 : లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, డేరాబస్సి
* డిసెంబర్ 29, 2022 : భోపాల్, ఇండోర్
* జనవరి 5, 2023 : భువనేశ్వర్, కటక్
* జనవరి 6, 2023 : జబల్‌పూర్, గ్వాలియర్, లూథియానా, సిలిగురి
* జనవరి 7, 2023 : జైపూర్, జోధ్‌పూర్ మరియు ఉదయపూర్
* జనవరి 7, 2023 : ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, తిరుపతి, నెల్లూరు, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్, అహ్మద్‌నగర్.

Jio 5G ఎలా యాక్సస్ చేయాలంటే? :
రిలయన్స్ జియో 5G సర్వీసులను కమర్సియల్ వినియోగానికి ప్రారంభించలేదు. Jio 5G ప్రారంభమైన నగరాల్లో నివసిస్తున్న యూజర్లందరికి 5G అందుబాటులో లేదు. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోని Jio యూజర్లు మాత్రమే Jio 5G వెల్ కమ్ ఆఫర్ అందుకుంటారు. Jio వెల్‌కమ్ ఆఫర్, అదనపు ఖర్చు లేకుండా 1 Gbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను కనెక్ట్ చేసుకోవచ్చు.

Reliance Jio 5G Services _ Jio 5G launched in 88 Indian cities _ Full list of cities, eligibility, And how to activate

Reliance Jio 5G Services _ Jio 5G launched in 88 Indian cities

జియో వెల్‌కమ్ ఆఫర్ :
వెల్‌కమ్ ఆఫర్‌ను స్వీకరించే జియో యూజర్లు తమ మొబైల్‌లో రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంటే మాత్రం.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ వినియోగాన్ని ఆస్వాదించవచ్చు. మీరు My Jio యాప్‌లో వెల్‌కమ్ ఆఫర్ కోసం చెక్ చేయవచ్చు. మీ డివైజ్ Jio 5Gకి కనెక్ట్ చేసేందుకు రెడీగా ఉంటే.. Jio SMS, WhatsApp మెసేజ్ కూడా పంపవచ్చు.

జియో 5G ప్లాన్ :
రిలయన్స్ జియో ఎలాంటి ప్రత్యేక 5G ప్లాన్‌ను ప్రారంభించలేదు. డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ను లిస్టు చేసింది. దీని ద్వారా జియో యూజర్లు 10 రెట్లు వేగవంతమైన 5G నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవచ్చు. రూ. 61 ధర కలిగిన ఈ ప్లాన్ ప్రస్తుత ప్లాన్‌కే పరిమితమైన వ్యాలిడిటీతో 6GB డేటాను అందిస్తుంది. ముఖ్యంగా, జియో యూజర్లు రూ. 239 కన్నా తక్కువ ప్లాన్‌ని కలిగి ఉంటే.. 5Gని ఉపయోగించడానికి రూ. 61 ప్లాన్‌ను పొందవచ్చు. రూ. 61 వోచర్ Jioని యాక్సెస్ చేసేందుకు రూ. 119, రూ. 149, రూ. 179, రూ. 199, రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.

Jio 5Gకి ఎలా కనెక్ట్ చేయాలంటే? :
Jio 5Gని 5G స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఉపయోగించవచ్చు మీరు 5G సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. అదనంగా, Jio 5G సపోర్టును పొందాలంటే OEM కూడా ఉండాలి. మీరు 5G సపోర్ట్‌తో సరికొత్త సిస్టమ్ అప్‌డేట్‌ను స్వీకరించారా లేదా మీ మొబైల్ తయారీదారు అప్‌డేట్ రిలీజ్ చేసే వరకు వేచి ఉండండి. విశేషమేమిటంటే.. మీ 5G స్మార్ట్‌ఫోన్‌లో 5G అప్‌డేట్‌ను స్వీకరించి.. అలాగే 5G వెల్‌కమ్ ఆఫర్‌ను స్పీకరించాలి. మీరు కొత్త నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసేందుకు మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చాలి. అలా చేయడానికి Settings Menu > Go to network settings > Switch to 5G అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : JioFiber Plans : జియోఫైబర్ ప్లాన్లు ఇవే.. 1Gbps ఇంటర్నెట్ స్పీడ్, OTT బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. మీకు నచ్చిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోండి!