రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ట్యాగ్స్.. ఇందులో మీది ఏ ప్లాన్? చెక్ చేసుకోండి

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త రీచార్జ్ అప్ డేట్స్ చేసింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై కొత్త ట్యాగ్స్ ప్రవేశపెట్టింది. బెస్ట్ సెల్లర్స్, సూపర్ వాల్యూ, ట్రెండింగ్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ట్యాగ్స్ అందిస్తోంది.

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ట్యాగ్స్.. ఇందులో మీది ఏ ప్లాన్? చెక్ చేసుకోండి

Reliance Jio tags for Three prepaid plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త రీచార్జ్ అప్ డేట్స్ చేసింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై కొత్త ట్యాగ్స్ ప్రవేశపెట్టింది. బెస్ట్ సెల్లర్స్, సూపర్ వాల్యూ, ట్రెండింగ్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ట్యాగ్స్ అందిస్తోంది. రీచార్జ్ వ్యాలిడిటీ ముగిసే ముందు తర్వాతి రీఛార్జ్ కోసం జియో యూజర్లు ఈ ట్యాగ్స్ వినియోగించుకోవచ్చు. ఇప్పటివరకూ జియో నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ట్యాగ్స్ చేసింది.

బెస్ట్ సెల్లర్స్ ప్లాన్ కింద రూ.199, రూ.555, రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది. అలాగే రూ.249, రూ.2,599 ప్రీపెయిడ్ ప్లాన్లపై సూపర్ వ్యాల్యూ ప్లాన్లకు ట్యాగ్ చేసింది. చివరిగా రూ.349 ప్లాన్ ట్రెండింగ్ ప్లాన్ కింద ట్యాగ్ చేసింది. ఇంతకీ ఈ మూడు జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై ఎంత డేటా, బెనిఫిట్స్ అందిస్తోందో ఓసారి చూద్దాం..

జియో సూపర్ వాల్యూ ప్లాన్లు :
రూ.249 ప్లాన్ కింద.. రోజు 2GB డేటాను ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్ కూడా, రోజుకు 100 SMSలను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ మొత్తం 28 రోజుల వ్యాలిడిటీపై అందిస్తోంది.

రూ.2599 ప్లాన్ కింద.. రోజుకు 2GB డేటాను అందిస్తోంది. అదనంగా 365 రోజుల వరకు 10GB డేటా వరకు ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను ఆఫర్ చేస్తోంది.

జియో బెస్ట్ సెల్లార్ ప్లాన్లు :
– రూ.199, రూ.555 ప్లాన్ల కింద రోజు హైస్పీడ్ డేటాను 1.5GB డేటా వరకు ఆఫర్ చేస్తోంది. అలాగే రోజుకు 100SMSలను ఆఫర్ చేస్తోంది.
– రూ.199 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.. రూ.555 ప్లాన్ కింద 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.
రూ.599, రూ.2,399 ప్లాన్ కింద కస్టమర్లు రోజువారీ 2GB డేటాను అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 రోజువారీ కంప్లిమెంటరీ ఎస్ఎంఎస్ లను అందిస్తోంది.
– రూ.599 ప్లాన్ కింద 84రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తోంది.
– రూ.2,399 ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.

జియో ట్రెండింగ్ ప్లాన్లు :
రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ కింద రోజు 3GB డేటాను అందిస్తోంది. రోజూ 100 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందిస్తోంది.