Reliance JioSaavn Pro Plans : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. మ్యూజిక్ లవర్స్ కోసం జియోసావన్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Reliance JioSaavn Pro Plans: జియోసావన్ ప్రో (JioSaavn Pro) అనేది ఒక పాపులర్ స్ట్రీమింగ్ సర్వీసు. జియో యూజర్లకు యాడ్-ప్రీ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్, అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్‌లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioTunes అనే ఫీచర్‌ను అందిస్తుంది.

Reliance JioSaavn Pro Plans : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. మ్యూజిక్ లవర్స్ కోసం జియోసావన్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Reliance Jio introduces new prepaid plans with free JioSaavn subscription

Reliance JioSaavn Pro Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) సంగీత ప్రియులందరి కోసం ఒక ప్రత్యేక డీల్‌తో ముందుకు వచ్చింది. ప్రత్యేకించి మ్యూజిక్ ప్రియుల కోసం టెలికాం కంపెనీ JioSaavn సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అంటే.. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో జియో కస్టమర్‌లు JioSaavn ప్రో సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. JioSaavn Pro అనేది ఒక పాపులర్ స్ట్రీమింగ్ సర్వీసు. జియో యూజర్లకు యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్‌లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioTunes ఫీచర్‌ను అందిస్తుంది. JioSaavn సబ్‌స్క్రిప్షన్ 5 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో విభిన్న వ్యాలిడిటీలతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 269 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో అత్యంత ఖరీదైన ప్లాన్ ధర రూ. 789తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : iQOO Neo 7 Pro : 50MP కెమెరాతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

నెలకు రూ. 99కే జియోసావన్ ప్లాన్ :
మీరు జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా కొనుగోలు చేయాలనుకుంటే.. నెలకు రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌లతో మీరు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. రూ. 269 ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు ఉచితంగా JioSaavn సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. తద్వారా రోజుకు 1.5GB డేటాను పొందవచ్చు. మరో ప్లాన్ ధర రూ. 529 ఉండగా.. 56 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ జాబితాలోని అత్యంత ఖరీదైన ప్లాన్ రూ. 739 వద్ద ఉంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. మీరు ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే.. యాడ్-ఫ్రీ మ్యూజిక్, JioTunes వంటి మరిన్నింటిని పొందవచ్చు. రోజుకు 2GB ప్లాన్‌లలో రూ. 589 ధర గల మరో రెండు ప్లాన్‌లు ఉన్నాయి. 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇతర ప్లాన్ ధర రూ. 789 ఉండగా… ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల వరకు ఉంటుంది.

Reliance Jio introduces new prepaid plans with free JioSaavn subscription

Reliance JioSaavn Pro Plans : Reliance Jio introduces new prepaid plans with free JioSaavn subscription

జియో నెంబర్లతోనే యాప్ sign-in చేయాలి :
రిలయన్స్ జియో మొబైల్ నంబర్‌లను ఉపయోగించి (JioSaavn) యాప్‌కి సైన్ ఇన్ చేయాలి. జియో కస్టమర్‌లు తమకు ఇష్టమైన ట్యూన్‌లను 15 విభిన్న భాషల్లో వినవచ్చు. JioSaavn Pro సబ్‌స్క్రిప్షన్ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో యాడ్స్ లేకుండా నిరంతరాయమైన మ్యూజిక్ ప్లేబ్యాక్, అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్‌లు, JioTunes కలెక్షన్ యాక్సెస్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ ఆఫ్‌లైన్ మ్యూజిక్ కూడా ఆస్వాదించవచ్చు. JioSaavn బండిల్ ప్లాన్‌ కోసం కస్టమర్‌లు తమ ప్రస్తుత యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా MyJio యాప్ లేదా Jio.com ద్వారా JioSaavn ప్లాన్‌కి సులభంగా మారవచ్చు.

జియోసావన్ (JioSaavn Pro) భారత మార్కెట్లో పుల్ పాపులర్ అయింది. ఈ యాప్‌లో 100 మిలియన్లకు పైగా యాక్టివ్ నెలవారీ యూజర్ల యూజర్ బేస్ ఉంది. వివిధ భాషల నుంచి అనేక పాటలతో కూడిన లాంగ్ లైబ్రరీని కలిగి ఉంది. విభిన్న మ్యూజిక్ ట్రాకులు, ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్‌లు, రియల్టీ షోలను కూడా కలిగి ఉంది. JioSaavn ప్రో సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసుకోవాలంటే MyJio, Jio.com, TPA లేదా Jio స్టోర్ ద్వారా అందించే ఏవైనా JioSaavn బండిల్ ప్లాన్‌లతో అకౌంట్లను రీఛార్జ్ చేయండి. JioSaavn యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. JioSaavn ప్రో బండిల్‌తో ఇంటిగ్రేట్ అయిన మొబైల్ నంబర్‌ని ఉపయోగించి సైన్ ఇన్ (Sign In) చేయండి. అంతే.. జియో సావన్ సబ్‌స్ర్కిప్షన్ పొందినట్టే..

Read Also : JioCinema Stream : ఐపీఎల్ 2023 సక్సెస్.. జియోసినిమాలో బిగ్‌బాస్ OTT 2 ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచో తెలుసా?