Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Reliance Jio : భారీవర్షాలతో అతులాకుతలమైన అసోం & నార్త్ ఈస్ట్‌లోని యూజర్లకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. నాలుగు రోజుల పాటు అక్కడి జియో యూజర్లకు టెలికాం ఆపరేటర్ ఉచితంగా అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.

Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Reliance Jio Is Offering Four Days Of Free Unlimited Benefits To Select Users (1)

Reliance Jio : భారీవర్షాలతో అతులాకుతలమైన అసోం & నార్త్ ఈస్ట్‌లోని యూజర్లకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. నాలుగు రోజుల పాటు అక్కడి జియో యూజర్లకు టెలికాం ఆపరేటర్ ఉచితంగా అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రకారం.. అర్హత కలిగిన జియో కస్టమర్‌లు ఏదైనా నెట్‌వర్క్ డేటా సర్వీసుకు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్‌లను పొందవచ్చు. అలాగే నాలుగు రోజుల పాటు ఎలాంటి ఖర్చు లేకుండా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 100 SMSలు పొందవచ్చు.

అసోంలోని దిమా హసావో, కర్బీ అంగ్లాంగ్ ఈస్ట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, హోజాయ్ కాచార్ ప్రభావిత జిల్లాల్లో ఉన్న జియో యూజర్లు ఈ జియో అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అందుకే అసోంలోని జియో యూజర్లకు Reliance Jio మెసేజ్ పంపుతోంది. ‘మీ నంబర్‌కి కాంప్లిమెంటరీ 4-Day అన్ లిమిటెడ్ ప్లాన్‌ అందిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో జియో నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జియో యూజర్లు ఇతర ప్రాంతాలలో ప్రయాణ పరిమితుల కారణంగా రీఛార్జ్‌లు చేసుకోలేరు. ఈ ప్లాన్ జియో బాధిత కస్టమర్లకు సకాలంలో సర్వీసులను అందించేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు’ జియో తెలిపింది.

Reliance Jio Is Offering Four Days Of Free Unlimited Benefits To Select Users (2)

Reliance Jio Is Offering Four Days Of Free Unlimited Benefits To Select Users

ఫ్రీ 4-డే అన్ లిమిటెడ్ Jio ప్లాన్ కోసం..
రిలయన్స్ జియో ఉచిత అన్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌కు అర్హులైన ప్రతి ఒక్కరికీ SMS పంపుతోంది. పైన పేర్కొన్న ప్రాంతాలలో మీరు ఉన్నట్లయితే.. మీరూ కూడా ఈ జియో ఆఫర్ పొందవచ్చు. MyJio యాప్‌కి వెళ్లి మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. Jio అందించే ఉచిత 4-రోజుల అన్ లిమిటెడ్ ప్లాన్‌ మీకు వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోండి.

Read Also :  Airtel vs Jio vs Vi : రూ. 500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లివే.. OTT బెనిఫిట్స్..!