Reliance Jio Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 40GB వరకు ఫ్రీ డేటా.. ఇదిగో ఫుల్ లిస్టు.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!

Reliance Jio Plans : రిలయన్స్ జియో వినియోగదారులు 5G డేటా బెనిఫిట్స్‌తో పాటు 40GB వరకు అదనపు ఉచిత డేటా, 3GB రోజువారీ డేటాను పొందవచ్చు.

Reliance Jio Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 40GB వరకు ఫ్రీ డేటా.. ఇదిగో ఫుల్ లిస్టు.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!

Reliance Jio is offering up to 40GB free data on select recharge plans

Reliance Jio Plans : IPL 2023 సీజన్ ప్రారంభంలో జియో కొత్త క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్‌లు యూజర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, 5G బెనిఫిట్స్‌తో 3GB రోజువారీ డేటా ప్యాక్‌లను అందిస్తాయి. అంతేకాదు.. జియో యూజర్లు (JioCinema)లో మ్యాచ్‌ల లైవ్‌లో చూడటం లేదా వారికి ఇష్టమైన సిరీస్‌లు లేదా మూవీలను చూడవచ్చు. ఇందుకోసం జియో తమ యూజర్ల కోసం గరిష్టంగా 40GB అదనపు ఉచిత డేటాను అందిస్తోంది.

Jio క్రికెట్ ప్లాన్ అత్యధిక డేటా ఆఫర్‌తో వస్తుంది. రోజుకు 3 GB డేటాను పొందవచ్చు. స్ట్రీమింగ్ యాక్సస్ కూడా పొందవచ్చు. అదనంగా ఉచిత డేటా వోచర్‌లను కూడా పొందవచ్చునని జియో తెలిపింది. రూ. 219, రూ. 399, రూ. 999 ధరలో ఈ ప్లాన్‌లు 40GB వరకు ఉచిత డేటాను అందిస్తాయి. ఫోన్ కాలింగ్, SMS, ఇతర డేటా బెనిఫిట్స్ అందిస్తాయి. జియో అందించే అన్ని క్రికెట్ స్పెషల్ ప్లాన్‌లు, అదనపు బెనిఫిట్స్ గురించి వివరంగా పరిశీలిద్దాం.

జియో 3GB రోజువారీ డేటా ప్లాన్ వివరాలు :
జియో రూ. 219 ప్లాన్ : ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMS, రోజుకు 3GB డేటా, అలాగే 14 రోజుల పాటు Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. జియో యూజర్లు రూ. 25 విలువైన కాంప్లిమెంటరీ 2GB డేటా యాడ్-ఆన్ వోచర్‌ను కూడా పొందవచ్చు. జియో వెల్‌కమ్ 5G ఆఫర్‌ను పొందినవారికి, అదనపు ఖర్చు లేకుండా 5G డేటా అందుబాటులో ఉంటుంది.

Read Also : Waayu Food Delivery App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా.. సరికొత్త ఫుడ్ డెలివరీ Waayu యాప్‌.. తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ..!

జియో రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ కింద జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMS, రోజుకు 3GB డేటాను యాక్సెస్ చేయవచ్చు. ప్రత్యేక ఆఫర్‌ కింద రూ. 61 విలువైన 6GB డేటా యాడ్-ఆన్ వోచర్ ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది.

Reliance Jio is offering up to 40GB free data on select recharge plans

Reliance Jio is offering up to 40GB free data on select recharge plans

జియో రూ 999 ప్లాన్ : జియో నుంచి ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMS, రోజుకు 3GB డేటాతో పాటు 84 రోజుల పాటు జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. 5Gకి యాక్సెస్ ఉన్న యూజర్లు లిమిటెడ్ టైమ్ వరకు రూ.241 విలువైన 40GB ఉచిత డేటాను కూడా పొందవచ్చు.

ప్రత్యేక ప్రీపెయిడ్ మొబైల్ బేస్ ప్లాన్‌లతో పాటు, క్రికెట్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా జియో అందిస్తోంది. రూ.222 డేటా యాడ్-ఆన్ ప్లాన్ కింద యూజర్లు 50GB డేటాను అందిస్తుంది. తమ యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ యాడ్ ఆన్ ప్లాన్ వర్తిస్తుంది. రూ.444 ప్లాన్ కింద 60 రోజుల పాటు అదనంగా 100GB డేటాను అందిస్తుంది. రూ.667 ప్లాన్ కింద 90 రోజుల వ్యాలిడిటీతో 150GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లను (My Jio) యాప్ లేదా అధికారిక (Jio) వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

అదే సమయంలో, రిలయన్స్ జియో (Reliance Jio) పోటీదారుగా ఎయిర్‌టెల్ అదనపు OTT బెనిఫిట్స్, 3GB డేటా ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ యూజర్లు మూడు ప్లాన్‌ల నుంచి ఎంచుకోవచ్చు. అందులో రూ. 199, రూ. 499, రూ. 699 ఉన్నాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, OTT బెనిఫిట్స్ అందిస్తుంది. అర్హత ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఆస్వాదించవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లు Airtel Thanks యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను చెక్ చేయవచ్చు.

Read Also : Maruti Suzuki Jimny : మారుతి సుజుకి జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 24,500 బుకింగ్స్ దాటేసింది.. ఈ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?