రిలయన్స్ జియో ల్యాప్‌టాప్‌లు వస్తున్నాయి.. చౌకైన ధరకే ‘జియోబుక్’

రిలయన్స్ జియో ల్యాప్‌టాప్‌లు వస్తున్నాయి.. చౌకైన ధరకే ‘జియోబుక్’

Reliance Jio laptop JioBook  : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి కొత్త ల్యాప్ టాప్ లు వస్తున్నాయి. ‘జియో బుక్’ పేరుతో అతి త్వరలో మార్కెట్లోకి జియో ల్యాప్ టాప్ రానున్నాయి. అత్యంత చౌకైన ధరకే ఈ జియో ల్యాప్ టాప్ లు అందుబాటులోకి రానున్నాయి. 4G ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొబైల్ యూజర్లను ఆకట్టుకున్న జియో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆధారిత జియోఓఎస్ (JioOS)తో ప్రవేశపెట్టబోతోంది. ఇండియా మార్కెట్లో జియో ల్యాప్ టాప్ సర్వీసులను మరింత విస్తరించే దిశగా ప్లాన్ చేస్తోంది.

అందిన రిపోర్టు ప్రకారం.. జియో ఎన్నడూ లేనంతంగా మొట్టమొదటిసారి ల్యాప్ టాప్ ప్రవేశపెడుతోంది. విండోస్ ఓస్‌కు బదులుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ల్యాప్ టాప్ ను జియోఓఎస్ తో డెవలప్ చేస్తోంది. ఈ జియో బుక్ ల్యాప్ టాప్ జియోబుక్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 చిప్ అందించనుంది. స్నాప్ డ్రాగన్ 665 Soc ప్రాసెసర్ కూడా ఉండనుంది. 4G LTE ఎనేబుల్డ్ స్నాప్ డ్రాగన్ X12 మోడమ్ ఉండనుంది. జియో 4జీ సెల్యూలర్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చు. జియోబుక్ ల్యాప్ టాప్ కు సంబంధించిన ఒక ప్రొటోటైఫ్ ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.

ఇందులో కీబోర్డు విండోస్ మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఫైనల్ ల్యాప్ టాప్‌లో మారే అవకాశం ఉంది. 2021 తొలి త్రైమాసికంలో జియోబుక్ ల్యాప్ టాప్ చేసేందుకు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ జియో ఫోన్ కూడా లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. క్వాల్ కామ్, గూగుల్ భాగస్వామ్యంతో రిలయన్స్ జియో కంపెనీ అత్యంత చౌకైన ఆండ్రాయిడ్ ఆధారిత జియో స్మార్ట్ ఫోన్ కూడా అందించనుంది.