Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్లు ఇవే.. 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?
Reliance Jio Plans : ప్రముఖ రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 899, రూ. 349గా ఉంది. రెండు జియో ప్లాన్లు MyJio యాప్, Jio వెబ్సైట్ ,ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Reliance Jio launched 2 new plans with 2.5GB data per day and unlimited calls
Reliance Jio Plans : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ధర రూ. 899, రూ. 349గా ఉంది. రెండు జియో ప్లాన్లు MyJio యాప్, Jio వెబ్సైట్ ,ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన జియో ప్లాన్లు 90 రోజుల వరకు వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్లు, 2.5GB రోజువారీ డేటాతో మరిన్నింటిని అందిస్తాయి. ఈ జియో ప్లాన్లు అందించే బెనిఫిట్స్ ఓసారి చూద్దాం.
కొత్తగా ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో రూ. 349 ప్లాన్ 2.5GB రోజువారీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వ్యవధికి 75GB మొత్తం డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. జియో రూ. 349 ప్లాన్ రోజుకు 100 SMSలు JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్‌ను అందిస్తుంది. అదనంగా, టెలికాం ఆపరేటర్ వెల్కమ్ ఆఫర్లో భాగంగా 5G డేటాను అందిస్తోంది. రూ. 899 విలువైన రెండో కొత్తగా ప్లాన్‌కి అందిస్తోంది. ఈ కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMSలను 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
ఈ ప్లాన్ 225GB డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. చౌకైన రూ.349 ప్లాన్ మాదిరిగానే.. టెలికాం ఆపరేటర్ రూ.899 ప్లాన్‌తో వెల్కమ్ ఆఫర్లో భాగంగా 5G డేటాను అందిస్తోంది. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5G సర్వీసును దేశవ్యాప్తంగా 100 కన్నా ఎక్కువ నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్ అంతటా 5G సర్వీసులు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Reliance Jio Plans : Reliance Jio launched 2 new plans with 2.5GB data per day
Read Also : WhatsApp Voice Messages : వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను ఇకపై స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
అక్టోబర్ 4, 2022 : ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా
అక్టోబర్ 22, 2022 : నాథద్వారా, చెన్నై
నవంబర్ 10, 2022 : బెంగళూరు, హైదరాబాద్
నవంబర్ 11, 2022 : గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్
నవంబర్ 23, 2022 : పూణే
నవంబర్ 25, 2022 : గుజరాత్‌లోని 33-జిల్లాలు
డిసెంబర్ 14, 2022 : ఉజ్జయిని దేవాలయాలు
డిసెంబర్ 20, 2022 : కొచ్చి, గురువాయూర్ ఆలయం
డిసెంబర్ 26, 2022 : తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు,
డిసెంబర్ 28, 2022 : లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్, డేరాబస్సి
డిసెంబర్ 29, 2022 : భోపాల్, ఇండోర్
జనవరి 5, 2023 : భువనేశ్వర్, కటక్
జనవరి 6, 2023 : జబల్పూర్, గ్వాలియర్, లూథియానా, సిలిగురి
జనవరి 7, 2023 : జైపూర్, జోధ్‌పూర్ మరియు ఉదయపూర్
జనవరి 7, 2023 : ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, తిరుపతి, నెల్లూరు, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్, అహ్మద్‌నగర్.
జనవరి 15, 2023 : రాయ్‌పూర్, దుర్గ్, భిలాయ్, పాట్నా, ముజఫర్‌పూర్, రాంచీ, జంషెడ్పూర్, ఉడిపి, కలబురగి, బళ్లారి, రూర్కెలా, బ్రహ్మపూర్, కొల్లాం, ఏలూరు మరియు అమరావతి.
జియో ప్లాన్లకు సంబంధించి అధికారిక Jio వెబ్సైట్లో నగరాల కోసం మళ్లీ చెక్ చేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..