Jio Emergency Data Loan : జియోలో ఎమర్జెన్సీ ‘డేటా లోన్’.. రీచార్జ్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి!

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ఎమర్జెన్సీ డేటా లోన్ ప్లాన్ ‘Emergency Data Loan Plan’ ప్రవేశపెట్టింది. జియో యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది.

Jio Emergency Data Loan : జియోలో ఎమర్జెన్సీ ‘డేటా లోన్’.. రీచార్జ్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి!

Jio Emergency Data Loan

Jio Emergency Data Loan : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ఎమర్జెన్సీ డేటా లోన్ ప్లాన్ ‘Emergency Data Loan Plan’ ప్రవేశపెట్టింది. జియో యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ప్రతిసారి ప్లాన్ గడువు ముగియకముందే డేటా అయిపోవడంతో మళ్లీ కొత్త ప్లాన్ తీసుకోవాల్సి వస్తోంది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ డేటా తీసుకునేలా Data Loan పేరుతో ప్లాన్ తీసుకొచ్చింది.

ఈ డేటా లోన్ ప్లాన్.. అందరి కస్టమర్లకు వర్తిస్తుంది.. హైస్పీడ్ డేటా ప్లాన్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ డేటా యాక్టివేట్ చేసుకోవడానికి వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత డేటాలో చెల్లించవచ్చు.

Reliance Jio Data Loan facility :
రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఈ ఎమర్జెన్సీ డేటా లోన్ (emergency data loan) సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ My Jio ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న డేటా ప్లాన్ రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండానే అత్యవసర డేటాను పొందవచ్చు. కేవలం రూ.11 విలువైన డేటా ప్యాక్ రీచార్జ్ అందిస్తోంది. ప్రతి ప్యాక్ లో 1GB వరకు ఐదు ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాకులు పొందవచ్చు.

‘Emergency data loan’ ఎలా పొందాలంటే?:
My Jio యాప్ లోకి వెళ్లండి.. టాప్ లెప్ట్ కార్నర్‌లో Menu ఆప్షన్ ఎంచుకోండి.
– Mobile Services ఆప్షన్ కింద Emergency Data Loan ఎంపిక చేయండి.
– బ్యానర్ కింద Proceed అని ఉంటుంది. దానిపై Click చేయండి.
– Get emergency data ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
– Activate now అని క్లిక్ చేయండి.
– తక్షణమే Emergency Data Loan యాక్టివేట్ అయిపోతుంది.