Reliance Jio Plans : రిలయన్స్ జియో 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. 40GB ఫ్రీ డేటా ఆఫర్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio Plans : రిలయన్స్ జియో క్రికెట్ అభిమానుల కోసం 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. IPL మ్యాచ్‌లను చూసేందుకు జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Reliance Jio Plans : రిలయన్స్ జియో 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. 40GB ఫ్రీ డేటా ఆఫర్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio New Plans _ Reliance Jio launches 3 new prepaid recharge plans with up to 40GB free data offer_ All details

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) క్రికెట్ అభిమానుల కోసం 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. డేటా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా IPL మ్యాచ్‌లను చూసేందుకు జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ప్లాన్ల ద్వారా జియో యూజర్లు 40GB వరకు డేటాను ఉచితంగా పొందవచ్చు. (IPL 2023) మొదటి మ్యాచ్ మార్చి 31న ప్రారంభం కానుంది. రిలయన్స్ జియో వినియోగదారుల కోసం 3 కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా ప్రకటించింది. జియో క్రికెట్ ప్లాన్ (Jio Cricket Plan) అత్యధిక డేటా ఆఫర్‌ అందిస్తోంది. రోజుకు 3GB డేటాతో పాటు అదనపు ఉచిత డేటా వోచర్‌లను పొందవచ్చునని టెలికాం దిగ్గజం తెలిపింది.

జియో 40GB వరకు ఫ్రీ డేటా :
రిలయన్స్ జియో నుంచి కొత్త రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్ బెనిఫిట్స్ అందిస్తుంది. దీంతో పాటు, Jio యూజర్లు 40GB డేటాతో సహా రూ. 241 విలువైన వోచర్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. కొత్త ప్యాక్ 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది.

Reliance Jio New Plans _ Reliance Jio launches 3 new prepaid recharge plans with up to 40GB free data offer_ All details

Reliance Jio Plans : Reliance Jio launches 3 new prepaid recharge plans

Read Also : Best Reliance Jio Plans : రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. హైస్పీడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

రూ. 399, రూ. 219 జియో రీఛార్జ్ ప్లాన్‌లు కూడా 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లతో వస్తాయి. రెండు ప్లాన్లపై వ్యాలిడిటీతో పాటు వోచర్ ఆఫర్ విభిన్నంగా ఉంటాయి. లేటెస్ట్ రూ.399 రీఛార్జ్ ప్లాన్‌లో రూ. 61 విలువైన ఉచిత వోచర్‌తో పాటు 6GB అదనపు డేటాను అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత 28 రోజుల తర్వాత ఈ ప్యాక్ గడువు ముగియనుంది. రూ.219 ప్యాక్ 14 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. జియో కస్టమర్లకు 2GB ఉచిత డేటాను అందిస్తుంది.

జియో కొత్త క్రికెట్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు ఇవే :
టెలికాం కంపెనీ 3 కొత్త డేటా ఆన్ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. రూ.222 డేటా యాడ్-ఆన్ ప్యాక్ 50GB డేటాను అందిస్తుంది. మీ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. రూ. 444 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీ వ్యవధితో 100GB డేటా ఉంటుంది. చివరగా, రూ. 667 జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్ 150GB డేటాను అందిస్తుంది. మీరు ఈ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు మార్చి 24 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ధృవీకరించింది.

Read Also : Apple iPhone 15 Series : రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో 5 అతిపెద్ద డిజైన్ మార్పులివే..?