Reliance Jio Plans : రిలయన్స్ జియో సరసమైన ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్‌తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. జియో యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తోంది.

Reliance Jio Plans : రిలయన్స్ జియో సరసమైన ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్‌తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Reliance Jio plans _ Cheapest Reliance Jio plans for users who watch Instagram Reels all day

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. జియో యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 1GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లు కేవలం కాలింగ్, SMS, కనిష్ట ఇంటర్నెట్ డేటా బెనిఫిట్స్ సహా ప్రీపెయిడ్ ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

రూ. 200 లోపు ధరకు Jio ఈ ప్లాన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. దాదాపు 1 నెల వ్యాలిడిటీని అందిస్తోంది. మీ ఫోన్‌లో సెకండరీ సిమ్‌గా Jioని మీ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. సరసమైన జియో ప్లాన్‌లను పొందాలంటే.. ఈ ప్లాన్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.1GB రోజువారీ డేటా, కాలింగ్, అదనపు బెనిఫిట్స్ సంబంధించి Jio ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం..

జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో వచ్చింది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లిమిట్ అందిస్తుంది. ఇంటర్నెట్ డేటా ప్యాక్ విషయానికొస్తే.. ప్లాన్ 1GB రోజువారీ డేటా లిమిట్‌తో మొత్తం 28GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా వినియోగం తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. అదనంగా, యూజర్లు JioTV, JioCinema, JioSecurity, JioCloudకి ఫ్రీగా సభ్యత్వాన్ని పొందవచ్చు.

జియో రూ. 179 ప్రీపెయిడ్ ప్లాన్ :
24 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటా, 1GB రోజువారీ లిమిట్‌తో రోజుకు 100 SMSలను అందిస్తుంది. యూజర్లు OTT కంటెంట్‌ను పొందాలంటే వారి ఫైల్‌లను క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసేందుకు Jio TV, JioCinema, JioSecurity, JioCloudకి ఉచిత యాక్సస్ కూడా అందిస్తుంది.

Reliance Jio plans _ Cheapest Reliance Jio plans for users who watch Instagram Reels all day

Reliance Jio plans _ Cheapest Reliance Jio plans for users

Read Also : OnePlus Nord CE 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

జియో రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ మరింత సరసమైనది.. వ్యాలిడిటీని మరింత తగ్గించింది. జియో యూజర్ల అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 1GB రోజువారీ డేటా లిమిట్‌తో 20 రోజుల ప్యాక్ వ్యాలిడిటీని పొందవచ్చు. JioTV, JioCinema, JioSecurity, JioCloudకి ఫ్రీగా సభ్యత్వాన్ని పొందవచ్చు. సరసమైన ప్లాన్లలో వ్యాలిడిటీతో మరో రూ. 119 ప్లాన్ ఉంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ మొత్తం 300 SMSలతో 14 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు Jio యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు.

ఒక నెల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా కన్నా తక్కువ కావాలనుకునే యూజర్ల కోసం రూ. 259 ప్లాన్‌ని చూడవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద.. Jio ఫుల్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది.

Jio పోటీదారులైన Airtel కూడా 1GB రోజువారీ డేటా ప్లాన్‌ను అందిస్తుంది. Airtel 1GB రోజువారీ డేటా ప్లాన్‌లు 21 రోజుల వ్యాలిడిటీతో రూ.209, 24 రోజుల వ్యాలిడిటీతో రూ.239, 28 రోజుల వ్యాలిడిటీతో రూ.265గా ఉంది. ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMS లిమిట్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Voice Messages : వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను ఇకపై స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!