Jio Vs Airtel Vs Vodafone : రూ.300లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు.. Daily Data బెనిఫిట్స్ మీకోసం..

Jio Vs Airtel Vs Vodafone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అలర్ట్..

Jio Vs Airtel Vs Vodafone : రూ.300లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు.. Daily Data బెనిఫిట్స్ మీకోసం..

Realme Gt Neo 3 India Launch Date Announced, Here Is What To Expect (3)

Jio Vs Airtel Vs Vodafone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ప్రీపెయిడ్ ప్లాన్లలో ఏ ప్లాన్ బెస్ట్ తెలుసా? ఎందులో ఎక్కువ డేటా బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? అంటే.. ఈ మూడింట్లోనూ రూ.300 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖరీదు ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు డైలీ డేటా బెనిఫిట్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాదు.. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా పొందవచ్చు. ఒక వ్యాలిడిటీ విషయంలోనే మూడు నాలుగు రోజులు తేడా అంతే.. మిగతావన్నీ బెనిఫిట్స్ ఒకేలా అందిస్తున్నాయి. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో, టెలికాం ఆపరేటర్లు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందిస్తున్నాయి. అందులో రూ. 300లోపు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

ఎయిర్‌టెల్ (Airtel) :
– ఎయిర్‌టెల్ రోజుకు 1GB డేటాతో రెండు ప్లాన్‌లను అందిస్తోంది. ప్లాన్‌ల ధర రూ. 209, RS 239, రూ. 265. ఈ ప్లాన్లు వేర్వేరు వ్యాలిడిటీ వ్యవధితో అందుబాటులో ఉన్నాయి. ప్లాన్‌లు రోజుకు 1GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజువారీ SMS బెనిఫిట్స్, అమెజాన్ ప్రైమ్‌ ఒక నెల ఫ్రీగా పొందవచ్చు. 209 ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రూ. 239 ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అయితే రూ. 265 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. Airtel క్యాలెండర్ నెల ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ. 296గా నిర్ణయించింది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ఏదైనా నెట్‌వర్క్‌కి అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలు, నెల మొత్తం 25GB డేటాతో సహా బెనిఫిట్స పొందవచ్చు. డేటా అయిపోయిన తర్వాత యూజర్లు 1MBకి 50 పైసలు చెల్లించాల్సి ఉండొచ్చు.

Realme Gt Neo 3 India Launch Date Announced, Here Is What To Expect (2)

Realme Gt Neo 3 India Launch Date Announced, Here Is What To Expect

రిలయన్స్ జియో (Reliance Jio) :
– రిలయన్స్ జియో కూడా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో ఇటీవలే రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ మొదటి క్యాలెండర్ నెల ప్లాన్. రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. మీ రోజువారీ డేటా ముగిసిన తర్వాత.. మీరు 64kbps వేగంతో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయవచ్చు. రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో పాటు, రిలయన్స్ జియో ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. మీరు రోజుకు 100SMS Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ నెల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి నెలాఖరున ఈ ప్లాన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్‌ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. రోజుకు 100 SMSలను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్ జియో మూవీస్, జియో క్లౌడ్ మరిన్నింటితో సహా వివిధ జియో సర్వీసులకు ఉచిత సబ్ క్రిప్షన్ కూడా అందిస్తోంది.

వోడాఫోన్ ఐడియా ప్లాన్లు :
– Vodafone Idea రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్‌ అందిస్తోంది. ప్రతిరోజూ 1GB రోజువారీ డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMS అన్ లిమిటెడ్ కాలింగ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్ 24 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రీపెయిడ్ ప్లాన్ Vi Movies, Disney+ Hotstar వంటి ఉచిత సబ్‌స్క్రిప్షన్ అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. మీకు మరిన్ని డేటా బెనిఫిట్స్ కావాలంటే ఇతర ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 1.5 GB డేటా, రోజుకు 100SMS రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మీరు ట్రై చేయొచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ఈ ప్లాన్ అదనపు డేటా బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. బింగే ఆల్-నైట్ ఫీచర్‌తో ఈ యూజర్లు సులభంగా నెటింట్లో సర్ఫ్ చేయొచ్చు. లేదంటే స్ట్రీమ్ చేసుకునేందుకు 12 అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు అదనపు ఖర్చు లేకుండా కావలసినవన్నీ షేర్ చేసుకోవచ్చు. వారాంతపు డేటా రోల్‌ఓవర్‌తో అదనపు ఖర్చు లేకుండా ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ Vi Moviesకి ఫ్రీ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

Read Also : Airtel Prepaid Plans : జియోకు పోటీగా.. ఎయిర్‌టెల్ నుంచి 2 చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!