JioPhone Next.. ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ దీపావళికి లాంచ్!

వినాయక చవితి రోజున JioPhone Next సొంతం చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిచూపారు. కానీ, నిరాశే ఎదురైంది. ఈ రోజు లాంచ్ కావాల్సిన ఫోన్ దీపావళికి వాయిదా పడింది.

JioPhone Next.. ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ దీపావళికి లాంచ్!

Jio Phone Next To Launch On September 10 (2)

Reliance won’t launch ‘JioPhone Next’ today : ప్రముఖ దేశీయ డేటా సంచలనం రిలయన్స్ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ వాయిదా పడింది. వినాయక చవితి (Ganesh Chaturthi)ని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న భారత మార్కెట్లో Jio Phone Next ఫోన్ లాంచ్ చేస్తామని అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. కానీ, ఈ 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ దీపావళికి లాంచ్ చేసేందుకు జియో, గూగుల్ సంస్థలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా Jio Phone Next అద్భుతమైన ఫీచర్లతో వస్తోందంటూ ప్రచారం జరిగింది.

జియో, గూగుల్ భాగస్వామ్యంలో వస్తున్న ఈ కొత్త 4G స్మార్ట్ ఫోన్ కు లాంచ్ కు ముందే ఫుల్ క్రేజ్ వచ్చింది. వినాయక చవితి రోజున జియో నెక్స్ట్ ఫోన్ సొంతం చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిచూపారు. కానీ, నిరాశే ఎదురైంది. ఈ రోజు లాంచ్ కావాల్సిన ఫోన్ దీపావళికి వాయిదా పడింది. గూగుల్ అందించే మోడ్రాన్ ఫీచర్లను జియో 4G స్మార్ట్ ఫోన్లలో అమర్చారు. ఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేదానిపై కూడా రివ్యూ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో చిప్ సెట్ స్టారేజీ తీవ్రంగా ఉంది. అందుకే ఇప్పుడు మార్కెట్లోకి Jio Phone Next ఫోన్ రిలీజ్ చేయడం సరైన సమయం కాదని గూగుల్, జియో సంస్థలు భావించాయి. దాంతో వచ్చే దీపావళికి ఈ ఫోన్ లాంచ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Jio Phone Next To Launch On September 10 (1)

జులైలో రిలయన్స్‌ AGM వార్షిక సమావేశం నుంచి Jio Phone Next ఫోన్ ఎప్పుడు వస్తుందా అంటూ వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ముఖేశ్ అంబానీ పది కోట్ల మందికి Jio Phone Next అందించడమే లక్ష్యమని ప్రకటించారు. కేవలం రూ.500 డిపాజిట్ చెల్లిస్తే.. మిగిలిన మొత్తం EMI రూపంలో చెల్లించవచ్చు అంటూ ఇప్పటికే ఫైనాన్స్ సంస్థలు రెడీ అయ్యాయి. ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చులే అనుకునే లోపే Jio Phone Next లాంచ్ వాయిదా పడినట్టు తెలిసింది. ఏది ఏమైనా ఈ ఏడాది దీపావళికి Jio Phone Next లాంచ్ ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకూ వేచి చూడాల్సిందే మరి..
JioPhone Next : ఫీచర్లు అదుర్స్.. చౌక ధరకే జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్

ఇప్పటికే జియో 4G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు లీక్ అయ్యాయి. జియో ఫోన్ నెక్స్ట్ లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో Voice Assistant, Automatic Read-alould screen text, Lanugage translation వంటి ఫీచర్లను ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. 2G ఫోన్ యూజర్లకు చౌకైన ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటోంది జియో.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఆండ్రాయిడ్, 4G జియో ఫోన్ ధర రూ.3499గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

Jio Phone Next To Launch On September 10 (2)

Jio Phone Next Specifications :
రిలయన్స్ జియో 4G స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లలో Jio Phone Next ఫోన్.. అల్ట్రా 4G మోడల్ తో వస్తోంది. ఫోన్ డిస్ ప్లే చుట్టూ ప్రత్యేకమైన బెజిల్స్ ఉండనున్నాయి. సింగిల్ రియర్ కెమెరాతో పాటు ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. 2G నుంచి 4G కన్వర్ట్ అయ్యే యూజర్లకు ఈ ఫోన్ పర్ ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఇన్ బుల్ట్ Real Aloud, Translate Now ఫీచర్లు ఆకర్షణీయంగా ఉండనున్నాయి. ఈ రెండు ఫీచర్ల సాయంతో Webpages, Apps, Messages, Photos ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. Google Assistant ద్వారా వాయిస్ అసిస్టెడ్ ఫీచర్లను యాక్సస్ చేసుకోవచ్చు. స్నాప్ భాగస్వామ్యంతో జియో.. భారత్ ప్రత్యేకమైన స్నాప్ చాట్ లెన్సులను ఫోన్ కెమెరాలో అమర్చింది. అదనంగా గూగుల్ ప్లే స్లోర్ తో పాటు Google Play Protect కూడా ప్రీలోడెడ్ అయి ఉంటుంది.

Android 11 (Go edition) ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 5.5 అంగుళాల HD డిస్‌ప్లే, Qualcomm QM215 SoC, 2GB RAM లేదా 3GB RAM, 16GB లేదా 32GB eMMC 4.5 ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ తో రానుంది. 13MP బ్యాక్ కెమెరా, సెల్ఫీలు, వీడియోల కోసం 8MP సెన్సార్ ఫ్రంట్ సైడ్ ఉండనున్నాయి. 2,500mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్ అందించనుంది. Bluetooth v4.2 సపోర్ట్, GPS కనెక్టవిటీ, 1080p వీడియో రికార్డింగ్ కెపాబులిటీ, DuoGO, Google Camera Go ప్రీ ఇన్ స్టాల్ అయి ఉన్నాయి. బిగ్ స్క్రీన్, AI, ఫాస్ట్ ప్రాసెసర్, గొరిల్లా గ్లాస్ ఆకర్షణీయమైన ఫీచర్లతోనే Jio Phone Next 4G స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అవుతోంది.
JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?