Republic Day 2023 : రిపబ్లిక్ డే 2023.. వాట్సాప్ స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేసి పంపుకోవాలో తెలుసా?

Republic Day 2023 : భారత్ 73వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2023న జరుపుకుంటుంది. ఈ పండుగ సందర్భంగా వాట్సాప్ యూజర్లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు.

Republic Day 2023 : రిపబ్లిక్ డే 2023.. వాట్సాప్ స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేసి పంపుకోవాలో తెలుసా?

Republic Day 2023 _ How to download and send WhatsApp stickers

Republic Day 2023 : భారత్ 73వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2023న జరుపుకుంటుంది. ఈ పండుగ సందర్భంగా వాట్సాప్ యూజర్లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. ఈ సందర్భంగా వాట్సాప్ స్టిక్కర్‌ (Whatsapp Stickers)లు, కోట్‌ (whatsapp quotes) లను డౌన్‌లోడ్ చేసేందుకు ఇష్టపడతారు. రిపబ్లిక్ డే వాట్సాప్ స్టిక్కర్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా? అలాగే వాట్సాప్ స్టిక్కర్లను మీ స్నేహితులకు ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* Google Play స్టోర్‌ ఓపెన్ చేయండి. రిపబ్లిక్ డే WhatsApp స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయండి.
* ఇప్పుడు మీకు ఇష్టమైన స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకుని, డౌన్‌లోడ్ చేసుకోండి.
* స్టిక్కర్ ప్యాక్‌ని ఓపెన్ చేసి ‘Add లేదా ‘Add to WhatsApp’ బటన్ Tap చేయాలి.
* ఇంకా, నిర్ధారించడానికి Add బటన్‌పై మళ్లీ Tap చేయండి.
* యాడ్ చేసిన తర్వాత, WhatsAppకి వెళ్లండి.
* మీరు వాటిని Send చేయాలనుకునే ఏదైనా చాట్ విండోను ఓపెన్ చేయండి.
* స్టిక్కర్ల సెక్షన్‌కు వెళ్లి, యాడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్‌కి నావిగేట్ చేయండి.
* ఏదైనా స్టిక్కర్‌ని పంపేందుకు దానిపై Tap చేయండి.

మరోవైపు.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పలు మొబైల్ కంపెనీలు తమ సేల్స్ పెంచేందుకు అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంటాయి. భారత్ అంతటా తమ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్పేస్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. తమ షాపింగ్ మోడ్ ఆధారంగా డైనమిక్ రేంజ్ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

Republic Day 2023 _ How to download and send WhatsApp stickers

Republic Day 2023 _ How to download and send WhatsApp stickers

Read Also : WhatsApp Big Update : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై హై-క్వాలిటీ ఫొటోలను ఈజీగా షేర్ చేయొచ్చు..!

రిపబ్లిక్ డే టాప్ ఆఫ్‌లైన్ సేల్ :
బజాజ్ మాల్ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్- టూ వీలర్ ఏదైనా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 5వేల వరకు అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందవచ్చు. మీ సమీపంలోని బజాజ్ మాల్‌ను విజిట్ చేయండి. మాల్ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి ప్రారంభమై జనవరి 26 వరకు కొనసాగుతుంది. సరసమైన EMI రేట్లలో ఎలాంటి ద్విచక్ర వాహనాన్ని అయినా అందిస్తామని బజాజ్ మాల్ ప్రకటించింది.

విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్ : (Vijay Sales Mega Republic Day Sale) ప్రముఖ విజయ్ సేల్స్ కూడా 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గాడ్జెట్‌లు, హౌస్, కిచెన్ వంటి ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన తగ్గింపులతో మెగా రిపబ్లిక్ డే సేల్స్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 22న లైవ్ అందుబాటులోకి వచ్చింది. సమీప విజయ్ సేల్ స్టోర్‌లో ప్రొడక్టులపై 65శాతం తగ్గింపును పొందవచ్చు.

క్రోమా రిపబ్లిక్ డే సేల్ : మీరు సరికొత్త స్మార్ట్‌ఫోన్ లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ డివైజ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఎలక్ట్రానిక్ రిటైల్ బ్రాండ్ తమ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ స్టోర్ ద్వారా రిపబ్లిక్ డే సేల్ జనవరి 19 నుంచి జనవరి 29 వరకు కొనసాగుతుంది. స్టోర్ నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేల్స్ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి.

TCL రిపబ్లిక్ డే సేల్ : రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. TCL స్మార్ట్ టీవీలు, LED టీవీలు, మినీ LED టీవీలపై 55శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. 15 రోజుల సేల్ సమయంలో జనవరి 15 నుంచి లైవ్ అందుబాటులో ఉంటుంది. అలాగే, తదుపరి TV కొనుగోలుపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ధరలను పొందవచ్చు. కొన్ని ఆప్షన్ చేసిన ప్రొడక్టులపై కంపెనీ 10శాతం క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Group Admins : ఆపిల్ ఐఫోన్లలో వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్స్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!