SBIలో Loan తీసుకున్నారా? అయితే EMI కట్టక్కర్లేదంట..!

  • Published By: sreehari ,Published On : September 15, 2020 / 04:06 PM IST
SBIలో Loan తీసుకున్నారా? అయితే EMI కట్టక్కర్లేదంట..!

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐలో లోన్ తీసుకున్నారా? అయితే మరోసారి EMI కట్టనవసరం లేదు.. మారటోరియం కింద ఎస్బీఐ కొత్త డిజిటల్ ప్లాట్ ఫాం తీసుకొస్తోంది. ఈ ప్లాట్ ఫాం ద్వారా లోన్ తీసుకున్నవారు లోన్ రిస్ట్రక్చరింగ్ కోసం అప్లయ్ చేయొచ్చు..

అందరికి కాదండోయ్.. అర్హత కలిగినోళ్లకే ఈ బెనిఫెట్ అంట.. మీరు ఈ ఆఫర్ కు ఎల్జిబుల్ కాదా? తెలియాలంటే ఓసారి ఈ కొత్త వెబ్ సైట్ పేజీ విజిట్ చేయాల్సిందే.. ఈ పోర్టల్‌ను సెప్టెంబర్ 24న ఎస్బీఐ కస్టమర్లకు అందు బాటులోకి తీసుకురానుంది.



RBI నిబంధనల ప్రకారం.. రిటైల్ లోన్ తీసుకున్నోళ్లు.. మళ్లీ మారటోరియం బెనిఫిట్ పొందొచ్చు.. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు లోన్ మారటోరియం బెనిఫెట్ పొందే అవకాశం ఉంది. మారటోరియంలో భాగంగానే ఎస్బీఐ బ్యాంకు రుణం పొందిన కస్టమర్ల కోసం ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
https://10tv.in/you-may-soon-be-able-to-view-covid-19-data-in-google-maps/



మళ్లీ మారటోరియం పొడిగించుకోనే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. 30 లక్షల మంది హౌసింగ్ లోన్ ఎస్బీఐ కస్టమర్లు ఉండగా.. వారిలో ఎవరైనా మారటోరియం పొడిగింపు అర్హతను చెక్ చేసుకోవచ్చు.. ఫుల్ ఆటోమేటిక్ అంటోంది ఎస్బీఐ.. సెప్టెంబర్ 22 నుంచి 24 నాటికి ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది.