Festival Season : కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇటు ఓ లుక్కేయండి

పండుగ సమయాల్లో కొత్త వాహనాలను విడుదల చేయడానికి అనేక ద్విచక్ర వాహన కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

Festival Season : కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇటు ఓ లుక్కేయండి

Himalaya

Festival Season : పండుగ సమయాల్లో కొత్త వాహనాలను విడుదల చేయడానికి అనేక ద్విచక్ర వాహన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ-జెన్ క్లాసిక్ 350 ఇప్పుడు కొత్త రేంజ్‌తో మార్కెట్లోకి వచ్చింది. మీరు దీపావళికి బైక్ కొనాలనుకుంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ఒక లుక్ వేయాలంటున్నారు నిపుణులు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. కంపెనీ ప్రస్తుతం కొత్త బైక్‌లను విడుదల చేస్తోంది. ఒకసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లపై లుక్కేద్దాం.

Read More :  రూ. 50వేల లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ 100కిలోమీటర్లు నడుస్తుంది

Himalaya

స్క్రామ్ 411

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హిమాలయన్ మోడల్‌‌ను అప్డేట్ చేస్తూ వస్తోంది. బైక్ స్వరూపం మారకుండా ఇంజిన్ కెపాసిటీ, టైర్లు, కలర్ మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఈ బైక్‌కి మంచి డిమాండ్ ఉండటంతో కంపెనీ ఈ మోడల్‌ను స్వల్ప మార్పులు చేస్తూ కొనసాగిస్తోంది. దీపావళికి మార్కెట్లోకి రానున్న హిమాలయన్ మోడల్‌లో కూడా స్వల్ప మార్పులు చేసింది కంపెనీ. ఇంజిన్, డిస్క్‌లలో స్వల్ప మార్పులు చేసింది కంపెనీ. దీని ధర కూడా కొద్దిగా పెరుగుతోందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలో ధర ప్రకటిస్తామని తెలిపారు.

Read More : సరికొత్త రికార్డు.. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన బైక్‌ల అమ్మకాలు

Gt 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650

తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 120వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 ఎడిషన్‌లో స్వల్ప కలర్ మార్పులు చేసింది. దీపావళికి మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుత ఎడిషన్ కంటే రూ.5 నుంచి 6వేలు ధర ఎక్కువ ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మోడల్ ధర రూ.3.20గా ఉంది. త్వరలో దీని ధరను అధికారికంగా ప్రకటించనున్నారు కంపెనీ ప్రతినిధులు.

Continantal

Continantal

Read More :  ట్రెండీ బైకులపై మనసు పారేసుకుంటున్న స్టార్స్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రూయిజర్ 650 షాట్‌గన్
ఈ బైక్ ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ మార్కెట్లోకి రానుంది. క్రూయిజర్ 650 షాట్‌గన్ కుర్రకారును కట్టిపడేసేలా డిసైన్ చేశారు. ప్రత్యేక బీటింగ్‌తో మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.3 లక్షలకు పైనే ఉండనుంది.