Samsung S23 Blur Issue : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో కెమెరా బ్లర్ ఇష్యూ.. ఎలా ఫిక్స్ చేస్తుందో క్లారిటీ ఇచ్చిందిగా..!
Samsung S23 Blur Issue : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్ కెమెరాలో ఇష్యూ ఉందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, ఈ శాంసంగ్ గెలాక్సీ S23 కెమెరాలో ఫిక్స్ చేయనున్నట్టు తెలిపింది.

Samsung Confirms Camera Blur Issue on Galaxy S23 and Galaxy S23 Plus
Samsung Blur Issue : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ S23 సిరీస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు మెరుగైన కెమెరాతో వచ్చినప్పటికీ, చాలా మంది యూజర్లు గెలాక్సీ S23, Galaxy S23+ క్లోజ్-అప్ షాట్‌లలో కెమెరా బ్లర్ సమస్య ఉందని తెలిపింది. ఇప్పుడు, శాంసంగ్ కూడా యూరప్ యూజర్ల కమ్యూనిటీ పేజీలో బగ్ సమస్యను ధృవీకరించింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించనున్నట్టు కంపెనీ తెలిపింది. దక్షిణ కొరియా సంస్థ బగ్ ఇష్యూ వెనుక ఉన్న కారణాన్ని కూడా వివరించింది.
శాంసంగ్ కమ్యూనిటీ పేజీ ద్వారా (Galaxy S23), (Galaxy S23+) నుంచి తీసిన క్లోజ్-అప్ షాట్‌లలో సబ్జెక్ట్ చుట్టూ ఉన్న ప్రాంతం కొంచెం అస్పష్టంగా ఉందని ధృవీకరించింది. S23, S23+ లలో వెనుక వైడ్ యాంగిల్ కెమెరా బ్రైట్ ఎపర్చర్‌ని కలిగి ఉందని తెలిపింది. ఈ ఫొటోల బ్యాక్‌గ్రౌండ్ కొంచెం అస్పష్టంగా ఉంటుందని కంపెనీ వివరించింది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా సమస్య పరిష్కరిస్తుందని శాంసంగ్ తెలిపింది. ఇంతలో, శాంసంగ్ గెలాక్సీ S23, Galaxy S23+లో కెమెరా బ్లర్ సమస్యను పరిష్కరించడానికి కొన్ని పరిష్కార మార్గాలను కూడా షేర్ చేసింది. శాంసంగ్ యూజర్లు కొంచెం ఎక్కువ దూరం నుంచి ఫొటోను తీయాలని సిఫార్సు చేసింది. ఫోన్‌ను అడ్డంగా లేదా ఏటవాలుగా పట్టుకోవడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ అస్పష్టంగా కనిపించవచ్చని వెల్లడించింది.

Samsung S23 Blur Issue Camera Blur Issue on Galaxy S23 and Galaxy S23 Plus
Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultraలను ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. Galaxy S23, Galaxy S23+ 6.6-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో పాటు 48Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్, గేమ్ మోడ్‌లో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.
ఈ రెండు ఫోన్‌లు Qualcomm లేటెస్ట్ చిప్‌సెట్, Snapdragon 8 Gen 2 Mobile Platform కలిగి ఉన్నాయి. ఆప్టిక్స్ ఫోన్‌లు 50-MPప్రైమరీ వైడ్-యాంగిల్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చాయి. ఈ ఫోన్‌లలో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
Read Also : Samsung OLED Smart TV : శాంసంగ్ కొత్త OLED స్మార్ట్‌టీవీ వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతంటే?