Samsung Galaxy A03s : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ కొత్త బడ్జెట్ ఫోన్.. ఇండియాలో ధర ఎంతంటే?

శాంసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ A03s కోర్ మోడల్ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎప్పటినుంచి సేల్ ప్రారంభమయ్యే తేదీని ప్రకటించలేదు.

Samsung Galaxy A03s : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ కొత్త బడ్జెట్ ఫోన్.. ఇండియాలో ధర ఎంతంటే?

Samsung Galaxy A03 Core Budget Phone Launched With A 5000mah Battery

Samsung Galaxy A03s : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ A03s కోర్ మోడల్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర కేవలం 7,999ల నుంచి మొదలవుతుంది. అలాగే 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో వస్తుంది. మార్కెట్లో ఇతర పోటీదారులైన Realme C Series, Poco M Series, Redmi 9 సిరీస్‌కు పోటీగా శాంసంగ్ తమ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్లు స్నాప్ డ్రాగన్ వేరియంట్‌లు Snapdragon 8 Gen 1 SoC ద్వారా పనిచేస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రిటైల్ స్టోర్‌లు, Samsung.com సహా ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లలో ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎప్పటినుంచి సేల్ ప్రారంభమవుతుందో కచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. Galaxy A03 ఫోన్.. కోర్ బ్లాక్ బ్లూతో సహా రెండు కలర్ ఆప్షన్లలో వస్తోంది. Samsung Galaxy A03s కోర్ ఆగస్టు నెలలో భారత్‌లో ప్రారంభించింది. Galaxy A03s వేరియంట్ కాస్తా కాస్ట్ ఎక్కువే. బేసిక్ వేరియంట్ 3GB RAM + 32GB స్టోరీజీతో వచ్చింది. ఈ వేరియంట్ ప్రారంభ ధర మార్కెట్లో రూ.11499 నుంచి అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజీతో టాప్-ఎండ్ మోడల్ రూ. 12499 కూడా అందుబాటులో ఉంది.

Samsung Galaxy A03s ఫీచర్లు ఇవే :
Samsung Galaxy A03s కోర్ పవర్ ఫుల్ ఫీచర్లను అందిస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, HD+ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఇన్ఫినిటీ V డిస్‌ప్లేతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో సపోర్ట్ అందిస్తుంది. ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్
సపోర్ట్‌తో వస్తుందా లేదా అనేది కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. Galaxy A03 కోర్.. 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది. ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ ఆధారంగా రన్ అవుతుంది. 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. సరికొత్త
Android Go 11 ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 10 Go తో పోలిస్తే.. ఆండ్రాయిడ్ 11 Go 20 శాతం వేగవంతమైనదని కంపెనీ వెల్లడించింది. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ బడ్జెట్ ఫోన్.. ఫ్రంట్ ప్యానెల్‌లో సింగిల్ కెమెరా సెన్సార్‌ ఉంటుంది. వెనుకవైపు.. ఫోన్ f/2.0 ఎపర్చర్‌తో 8MP కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. ఫోన్‌లో 5-MP ఇమేజ్ షూటర్ ఫీచర్ కూడా ఉంది.

Read Also : WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!