Samsung Galaxy A04e : శాంసంగ్ నుంచి గెలాక్సీ A04e కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy A04e : శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ లైనప్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను వస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లతో Galaxy A04eని లిస్టు అయిది. దక్షిణ కొరియా మొబైల్ బ్రాండ్ డివైజ్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు.

Samsung Galaxy A04e : శాంసంగ్ నుంచి గెలాక్సీ A04e కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy A04e : శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ లైనప్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను వస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లతో Galaxy A04eని లిస్టు అయిది. దక్షిణ కొరియా మొబైల్ బ్రాండ్ డివైజ్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో Galaxy A04s అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 13,499గా ఉండనుంది. సరికొత్త Samsung Galaxy A04e ఇదే ధరతో వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్ :
Samsung Galaxy A04e 6.5-అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో వస్తుంది. లిస్టింగ్ ప్రాసెసర్ పేరును వెల్లడించలేదు. జాబితా ప్రకారం.. హ్యాండ్‌సెట్ 4GB RAMని ప్యాక్ చేస్తుంది. గరిష్టంగా 128GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో పనిచేస్తుంది.

యూజర్లు మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. Samsung Galaxy A04e ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత One UI 4.1పై రన్ అవుతుంది. కెమెరా ముందు భాగంలో హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy A04e debuts with 5,000mAh battery and octa-core processor

Samsung Galaxy A04e debuts with 5,000mAh battery and octa-core processor

13MP (ఎపర్చరు f/2.2) ప్రధాన కెమెరా 2MP (ఎపర్చరు f/2.4) సెకండరీ కెమెరాతో రానుంది. సెల్ఫీల కోసం Galaxy A04e ముందు భాగంలో f/2.4 ఎపర్చర్‌తో 5MP కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీతో సపోర్టుతో వస్తుంది. Galaxy A0eలో Wi-Fi 802.11 b/g/n (2.4GHz), బ్లూటూత్ వెర్షన్ 5.0, LTE కనెక్టివిటీ ఆప్షన్లతో రావొచ్చు. ఈ ఫోన్ కొలతలు 164.2 x 75.9 x 9.1 మిమీతో రానుంది. Samsung Galaxy A0e బరువు 188 గ్రాములు. బ్లాక్, బ్లూ, కాపర్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Android Apps : మీ ఫోన్‌లో ఈ ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటే.. ఫోన్ బ్యాటరీ తగ్గిపోవచ్చు.. వెంటనే డిలీట్ చేసేయండి..!