ఏప్రిల్ 10 నుంచి సేల్ : శాంసంగ్ గెలాక్సీ A20 వచ్చేసింది

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లలోకి వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎ20 సిరీస్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. వచ్చే వారం నుంచి దేశ మొబైల్ మార్కెట్లలో శాంసంగ్ ఎ20 డివైజ్ అందుబాటులోకి రానుంది.

  • Published By: sreehari ,Published On : April 5, 2019 / 08:48 AM IST
ఏప్రిల్ 10 నుంచి సేల్ : శాంసంగ్ గెలాక్సీ A20 వచ్చేసింది

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లలోకి వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎ20 సిరీస్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. వచ్చే వారం నుంచి దేశ మొబైల్ మార్కెట్లలో శాంసంగ్ ఎ20 డివైజ్ అందుబాటులోకి రానుంది.

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లలోకి వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎ20 సిరీస్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. వచ్చే వారం నుంచి దేశ మొబైల్ మార్కెట్లలో శాంసంగ్ ఎ20 డివైజ్ అందుబాటులోకి రానుంది. శాంసంగ్ కంపెనీ 2019 లైనప్ లో భాగంగా గెలాక్సీ సిరీస్ లను వరుసగా రిలీజ్ చేస్తూ వస్తోంది. శాంసంగ్ రిలీజ్ చేసిన గెలాక్సీ ఎ10, గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఎ50 స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ సిరీస్ ల జాబితాలో ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ20 మోడల్ కూడా వచ్చి చేరింది. ఈ కొత్త మోడల్ ను శాంసంగ్ కంపెనీ రష్యాలో ఫిబ్రవరిలో ముందుగా లాంచ్ చేసింది. ఆ తర్వాత ఇండియాలో గెలాక్సీ ఎ20 సిరీస్ ను ప్రవేశపెట్టింది. 

ధర రూ. 12వేల 490 మాత్రమే 
ఇప్పటికే దేశ మార్కెట్లో రిలీజ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు రెడ్ మి నోట్ 7, రియల్ మి యూ1 సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. వీటికి పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎ20 స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేలా గెలాక్సీ ఎ20లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మూడు వేరియంట్లలో (బ్లాక్, బ్లూ, రెడ్) ఈ ఫోన్ మార్కెట్ లో లభ్యం కానుంది. ఏప్రిల్ 10 నుంచి ఇండియా మార్కెట్ లో శాంసంగ్ గెలాక్సీ ఎ20 సేల్స్ ప్రారంభం కానుంది.

శాంసంగ్ ఆన్ లైన్ షాప్, శాంసంగ్ ఓపెరా హౌస్, మేజర్ ఆన్ లైన్ రిటైలర్లు, బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లలో గెలాక్సీ ఎ20 అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రిటైల్ ధర రూ.12వేల 490 లకే లభ్యం కానుంది. ఈ ఫోన్లో సింగిల్ 3GB, 32GB స్టోరేజీ వేరియంట్లలో లభించనుంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇలా మరిన్నో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 

స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.4 అంగుళాల HD+ డిసిప్లే (720×1560 ఫిక్సల్స్)
డుయల్ రియర్ కెమెరా, 13 మెగా ఫిక్సల్ సెన్సార్ 
5-మెగా ఫిక్సల్ సెన్సార్ సెకండరీ కెమెరా 
ఫ్రంట్ 8 మెగా ఫిక్సల్ సెన్సార్ (f/2.0 లెన్స్)
సూపర్ AMOLED డిసిప్లే, వాటర్ డ్రాప్ నాచ్ 
ఆండ్రాయిడ్ 9 పై, యూఐ
ఇన్ఫినిటీ-వి డిసిప్లే డిజైన్ లాంగ్వేజ్
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్
అక్టా కోర్ ఎక్సోనస్ 7884 ఎస్ఒసీ
1.6GHz, రెండు హైపవర్ కోర్లు, ఆరు ఎఫిషియన్సీ కోర్లు
క్లాక్ స్పీడ్ 1.35GHz
సింగిల్ స్టోరేజీ 3GB ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
మైక్రో SD కార్డు (512GB వరకు ఎక్స్ పాండబుల్) స్టోరేజీ 
4000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
USB టైప్-సి పోర్ట్, 3D గ్లాస్టిక్, 158.4×74.7×7.8 mm