Samsung Galaxy A54 Sale : మార్చి 28 నుంచే శాంసంగ్ గెలాక్సీ A54, A34 సేల్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?

Samsung Galaxy A54 Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే మార్చి 28 నుంచి శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. (Samsung Galaxy A54), Galaxy A34 మోడల్స్ మార్చి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

Samsung Galaxy A54 Sale : మార్చి 28 నుంచే శాంసంగ్ గెలాక్సీ A54, A34 సేల్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?

Samsung Galaxy A54, Galaxy A34 to go on sale on March 28_ price, specifications

Samsung Galaxy A54 Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే మార్చి 28 నుంచి శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. (Samsung Galaxy A54), Galaxy A34 మోడల్స్ మార్చి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. సౌత్ కొరియన్ దిగ్గజ బ్రాండ్ శాంసంగ్ మార్చి 16న భారత మార్కెట్లో Galaxy A54, Galaxy A34తో A సిరీస్‌ను లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్ Galaxy S23 కన్నా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. Galaxy A34, Galaxy A54 కూడా రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తాయి. భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 40వేల కన్నా తక్కువ ఉండొచ్చు.

శాంసంగ్ ఇండియా (Samsung India)లోని మొబైల్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ.. ‘శాంసంగ్‌లో కొత్త గెలాక్సీ A54 5G, A34 5G ఫోన్లు కంపెనీ నిబద్ధతకు నిదర్శనం. ఈ డివైజ్‌లు సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్, నైట్‌గ్రఫీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. తక్కువ వెలుతురులో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. బెస్ట్-ఇన్-క్లాస్ IP67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లతో, Galaxy A54 5G, A34 5G యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Read Also : Jio Airtel Plans : అత్యంత సరసమైన ధరకే జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ పోస్టుపెయిడ్ ప్లాన్లు.. మరెన్నో కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

శాంసంగ్ గెలాక్సీ A54, Galaxy A34 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ A54 ఫోన్ 8GB+128GB వేరియంట్‌ ధర రూ. 38,999, రూ. 38,999 ఉండగా, 8GB+256GB ధర రూ.40,999గా ఉంటుంది. Galaxy A34 ఫోన్ మోడల్ 5G 8GB+128GB రూ. 30,999 నుంచి ప్రారంభమవుతుంది. Galaxy A34 5G ధర (8GB+256GB) రూ. 32,999గా ఉంది. రెండు డివైజ్‌లు మార్చి 28న Samsung స్పెషల్, పార్టనర్ స్టోర్‌లలో ఈజీ EMIతో అందుబాటులో ఉంటాయి.

Samsung Galaxy A54, Galaxy A34 to go on sale on March 28_ price, specifications

Samsung Galaxy A54, Galaxy A34 to go on sale on March 28

శాంసంగ్ గెలాక్సీ A54, Galaxy A34 ఫీచర్లు :
శాంసంగ్ నుంచి Galaxy A54, Galaxy A34 స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల sAMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 5nm ప్రాసెస్‌పై Exynos 1380 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. రెండో ఫీచర్.. డిస్‌ప్లే స్పెక్స్‌తో కొంచెం చిన్న 6.4-అంగుళాల sAMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. Galaxy A54, Galaxy A34 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A54 5G OISతో కూడిన ప్రైమరీ 50MP సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 5MP మాక్రో సెన్సార్‌తో పాటు పంచ్-హోల్ కటౌట్‌లో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A34 OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP మాక్రో సెన్సార్‌తో పాటు డ్యూడ్రాప్ నాచ్‌లో 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వచ్చాయి. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తాయి. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా OneUI 5.1తో రన్ అవుతాయి.

Read Also : Electricity Bill Scam : ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్‌తో జాగ్రత్త.. ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లు చెల్లించబోయి.. రూ. 7లక్షలు కోల్పోయిన ముంబై మహిళ.. అసలేం జరిగిందంటే?